చైల్డ్ వెల్‌ఫేర్ సెంటర్‌లో హైడ్రామా
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మకు ఆమె పెద్ద కుమార్తెను అప్పగించే విషయంలో నాంపల్లి భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న విశ్రాంత న్యాయమూర్తి ఇంటి వద్ద సింధు శర్మ ఆందోళన నేపథ్యంలో సోమవారం భరోసా కేంద్రం వద్ద పెద్ద కూతురును అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భరోసా సెంటర్‌లో ఇరు కుటుంబాలకు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడున్నరేళ్ల పాపను తనకు అప్పగించాలని […]
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మకు ఆమె పెద్ద కుమార్తెను అప్పగించే విషయంలో నాంపల్లి భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న విశ్రాంత న్యాయమూర్తి ఇంటి వద్ద సింధు శర్మ ఆందోళన నేపథ్యంలో సోమవారం భరోసా కేంద్రం వద్ద పెద్ద కూతురును అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భరోసా సెంటర్‌లో ఇరు కుటుంబాలకు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడున్నరేళ్ల పాపను తనకు అప్పగించాలని తల్లి సింధు శర్మ కోరగా.. ఆ ప్రతిపాదనను జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు కుటుంబీకులు వ్యతిరేకించారు. ఈ సమయంలో ఇరు కుటుంబాలూ చిన్నారిని తీసుకెళ్లేందుకు యత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల తీరును సింధు శర్మతో పాటు మహిళా సంఘాలు తప్పుపట్టాయి. చిన్నారిని తల్లికే అప్పగించాలని డిమాండ్ చేశాయి.