Sindhu Family: సింధు ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ : సీఎం జగన్ ఫోన్ చేసి గెలవాలన్నారు.. తెలుగు రాష్ట్రాల సీఎంల సహకారానికి ధన్యవాదాలు
తమ కుమార్తె పీవీ సింధు ఒలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడం తొలి భారత క్రీడాకారిణిగా నిలవడం హర్షణీయమన్నారు సింధు..
PV Sindhu Father: తమ కుమార్తె పీవీ సింధు ఒలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడం తొలి భారత క్రీడాకారిణిగా నిలవడం హర్షణీయమన్నారు సింధు తండ్రి పీవీ రమణ. టోక్యో ఒలింపిక్స్ లో సింధు బ్యాడ్మింటన్ కాంస్యం అందుకోవడం పట్ల ఆయన పుత్రికోత్సాహం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, సింధు ఫ్యామిలీ టీవీ9తో మాట్లాడారు, తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఒలింపిక్స్ కి పోటీపడే క్రమంలో సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ సంపూర్ణ సహకారం అందించారని రమణ తెలిపారు. సీఎం కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్, ఆయన అర్ధాంగి వైఎస్ భారతిలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఒలింపిక్స్ కు వెళ్లేముందు, కచ్చితంగా పతకం తేవాలంటూ సింధుకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారని రమణ వివరించారు.
కాగా, సింధు ఈ నెల 3న భారత్ తిరిగి వస్తోందని చెప్పిన రమణ.. నిన్నటి సెమీస్ లో ఓటమి తర్వాత సింధు కళ్లలో నీళ్లు చూశానన్న రమణ.. తన కోసం పతకం గెలవాలని తన కూతురికి సూచించానని వెల్లడించారు. చైనా షట్లర్ బింగ్జియావో ఆటతీరుపై అవగాహన వచ్చేలా పలు వీడియోలు కూడా పంపానన్నారు అటు, సింధు కోచ్ పార్క్ తై సేంగ్ కు కృతజ్ఞలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.