AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Software Baba: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కి పేకప్ చెప్పి.. స్వామీజీగా స్టార్టప్ ఆశ్రమం. అసాంఘీక కలాపాలు, భక్త జనానికి బోడిగుండ్లు

సాఫ్ట్ వేర్ బూమ్ మొత్తం గాయబ్.  జీవితం సెటిల్ చేస్కోవడం కష్టమని భావించాడా ఇంజినీర్...

Software Baba: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కి పేకప్ చెప్పి.. స్వామీజీగా స్టార్టప్ ఆశ్రమం. అసాంఘీక కలాపాలు, భక్త జనానికి బోడిగుండ్లు
Fake Baba 3
Venkata Narayana
|

Updated on: Aug 01, 2021 | 7:04 PM

Share

Software swami – Vishwa chaitanya baba: సాఫ్ట్ వేర్ బూమ్ మొత్తం గాయబ్.  జీవితం సెటిల్ చేస్కోవడం కష్టమని భావించాడా ఇంజినీర్. అంతే తన మైండ్ సెట్ మార్చేసుకుని – బాబాగా బోర్డ్ పెట్టేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు తెరలేపి – మెసాలకు తెగబడ్డాడు. లోతుల్లోకి వెళితే..

కృష్ణాజిల్లాకు చెందిన విశ్వ చైతన్య అప్పట్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అదే ఇప్పట్లో అంతకన్నా హార్డ్ కోర్ బురిడీ బాబా. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉండగా.. అప్పులపాలై పోయాడు. ఈ అప్పులను తీర్చేసి.. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలంటే ఈ జాబ్ సరిపోదని భావించాడు. అంతే ఐడియా ఛేంజ్ చేశాడు. బాబాగా అవతారమెత్తాడు. సాఫ్ట్ వేర్‌కి పేకప్ చెప్పి.. స్వామీజీగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు.

నల్గొండ జిల్లా పీఏ పల్లి – మండలంలో- అజ్మాపురంలో పదెకరాల ప్రాంగణంలో.. ఆశ్రమం తెరిచాడు. ఇక్కడ అమావాశ్య – పౌర్ణమి వస్తే చాలు సందడే సందడి. యజ్ఞాలు యాగాలు హోమాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. భక్త జనాలకు నామాలు పెట్టడం మొదలు పెట్టాడు.

జనం భయాందోళనలు – రోగాలనే వీక్నెస్ లే.. ఈ బురిడీ బాబా ఆయువు పట్టు. రోగాలు నయం చేస్తానంటూ లక్షలాది రూపాయల సంభావనలు వసూలు చేస్తాడు. ప్రవచనాలతో మాయ చేసి.. హోమాలతో కళ్లగప్పి- తాయత్తులతో మభ్య పెట్టేస్తాడు. ఇలా లక్షలాది రూపాయలను వెనకేశాడు విశ్వ చైతన్య.

Fake Baba 2

విశ్వ చైతన్య చేత ఎంత యజ్ఞం చేయించినా- రోగం నయం కాకపోవడంతో.. ఓ బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో విశ్వ చైతన్య పాపాల పుట్ట మొత్తం బట్టబయలయ్యింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులు లక్షలాది రూపాయల డబ్బు- బంగారం- విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఏడాదిన్నర క్రితం- పెట్టిన ఈ ఆశ్రమంలోకి స్థానికులకెవరికీ అనుమతుల్లేవంటున్నారు అజ్మాపురం సర్పంచ్. ఇక్కడికి హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ప్రవేశముంటుందనీ.. వీరికే ఈ నకిలీ బాబా ఆశీస్సులందుతాయనీ.. చెప్పుకొస్తున్నారు. ఇంకా ఈ బురిడీ బాబా ఎన్నేసి మోసాలు చేశారో ఆరా తీస్తున్నారు పోలీసులు.

Fake Baba

Read also:  Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!

ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..