Hyderabad: మాదాపూర్‌లో పెరుగుతున్న కలుషిత నీటి బాధితుల సంఖ్య.. భయాందోళనలో పట్టణ వాసులు
Drinking water polluted in Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ కలుషిత నీరు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాదాపూర్ వడ్డెర బస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్య ఇప్పటివరకు
Drinking water polluted in Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ కలుషిత నీరు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాదాపూర్ వడ్డెర బస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్య ఇప్పటివరకు 89కి చేరినట్లు అధికారులు తెలిపారు.. శనివారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో కొత్తగా ఆసుపత్రిలో 13 మంది చేరినట్లు వైద్యులు వెల్లడించారు. కొండాపూర్ ఆసుపత్రిలో 58 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కిడ్నీ సంబంధిత క్రియాటిన్ పెరగడంతో ఐదుగురికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆసుపత్రి నుంచి ఇప్పటివరకు 26 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో చిన్న పిల్లలు సైతం ఉన్నారు.
కాగా.. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కలుషిత నీరే అస్వస్థతకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా.. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. నీరు, ఆహారం, వాయు కాలుష్యం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే.. ఇవే లక్షణాలతో రెండు రోజుల క్రితం భీమయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.
కాగా.. ఇప్పటికే జలమండలి యంత్రాంగం నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపింది. దీనికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని.. దాని తర్వాత దీనికి గల కారణాలు వెల్లడవుతాయిని అధికారులు తెలిపారు.
Also Read: