AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: హైదరాబాద్ ట్రాఫిక్‎కు క్షణాల్లో పరిష్కారం.. వాటితో పోలీసుల కొత్త ప్రయోగం.. పూర్తి వివరాలు..

సైబరాబాద్‎లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని ఆవిష్కరించారు పోలీసులు. ఐటీ కారిడార్‎లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు. మరోసారి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఏరియల్ సర్వే లైన్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న అడ్వాన్స్‎డ్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నారు.

Watch Video: హైదరాబాద్ ట్రాఫిక్‎కు క్షణాల్లో పరిష్కారం.. వాటితో పోలీసుల కొత్త ప్రయోగం.. పూర్తి వివరాలు..
Hyderabad Traffic
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 15, 2024 | 9:56 AM

Share

సైబరాబాద్‎లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని ఆవిష్కరించారు పోలీసులు. ఐటీ కారిడార్‎లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు. మరోసారి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఏరియల్ సర్వే లైన్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న అడ్వాన్స్‎డ్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నారు. 100 మీటర్ల రేడియస్‎లో నుండి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడవున్నాయి.

హైదరాబాద్‎లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం సైబరాబాద్ ఐటీ కారిడార్. ప్రతిరోజు ఇక్కడ ట్రాఫిక్ సమస్య సర్వసాధారణం. అందులోనూ రానున్న వర్షాకాలం సమయాల్లో ట్రాఫిక్ సమస్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరంతరం ట్రాఫిక్ సమస్యల్లో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త డ్రోన్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఐటీ కారిడార్‎లో రద్దీగా ఉండే జంక్షన్‎లను టార్గెట్ చేసుకొని వాటి 100 మీటర్స్ రేడియస్ పరిధిలో ఈ డ్రోన్ కెమెరాను ఎగరవేసి ఇది చూపించే విజువల్స్ ఆధారంగా త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.

ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాల ఘటన స్థలానికి త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ఆక్సిడెంట్ అయిన ప్రాంతాన్ని నేరుగా పోలీసులు వీక్షించే విధంగా పరికరాన్ని క్రియేట్ చేశారు. ప్రమాదం జరిగిన చోటకు వెంటనే సంబంధిత పోలీసులను పంపించే దిశగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వమన్నారు. ఇక్కడ ట్రాఫిక్ కన్జేషన్‎గా మారిన వెంటనే వాటి సమాచారాన్ని కంట్రోల్ రూమ్‎కి చేరవేసే బాధ్యత ఈ డ్రోన్ కెమెరా 3rd eye లో ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..