Hyderabad: యువతికి వేధింపులు.. కట్ చేస్తే.. కాళ్లావేళ్లా పడ్డాడు..

హైదరాబాద్‌లోని పాతబస్తీ యువకులు ఓ యువతిని వేధింపులకి గురిచేయడంతో బెదిరిపోయింది. భయంతో వణికిపోతున్నప్పటికీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ఆ యువతి తన మొబైల్ ఫోన్ లో ఓ యువకుడు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును, చేస్తున్న అరాచకాన్ని వీడియో రికార్డు చేసి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దెబ్బకు ఆ యువకుడి దిమ్మ తిరిగేలా పోలీసులు బుద్ధి చెప్పారు

Hyderabad: యువతికి వేధింపులు.. కట్ చేస్తే.. కాళ్లావేళ్లా పడ్డాడు..
Police Counsels Those Who Harassed Young Women In Old Town
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 17, 2024 | 9:33 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీ యువకులు ఓ యువతిని వేధింపులకి గురిచేయడంతో బెదిరిపోయింది. భయంతో వణికిపోతున్నప్పటికీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ఆ యువతి తన మొబైల్ ఫోన్ లో ఓ యువకుడు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును, చేస్తున్న అరాచకాన్ని వీడియో రికార్డు చేసి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దెబ్బకు ఆ యువకుడి దిమ్మ తిరిగేలా పోలీసులు బుద్ధి చెప్పారు

వేధింపులకు గురి చేసిన ఆ యువకుడు తన పేరు మహ్మద్ మద్దీన్ అని, కావాలంటే తన ఆధార్ కార్డు చూపించాలా అంటూ అమ్మాయిపై పెత్తనం చెలాయిస్తూ మాట్లాడాడు. ఆ యువకుడి వీరంగం మొత్తాన్ని ఫోన్లో రికార్డు చేస్తుంటే.. అమ్మాయిని అడ్డుకోబోయాడు. ఆడవాళ్లతో ఇలాగే మాట్లాడతావా? చూడు ఏం చేస్తానో అని మాటకు మాట సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది. దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు యువకుడిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. శాలిబండ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాతబస్తీ ప్రాంతంలో అమ్మాయిలను, జనాలను వేధించిన ఎవరినైనా ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి