Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేన్స్ ప్రొఫెసర్ శ్రీరాం ...
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ) రెండో, నాలుగో సెమిస్టర్ బ్యాక్‌లాక్, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్,అయిదో సెమిస్టర్ మెయిన్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ తదితర పరీక్షలు వచ్చే నెల 30వ తేదీ నుంచి, బీఫార్మసీ పరీక్షలు వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.