Hyderabad Police Job Mela: రేపు హైదరాబాద్‌లో భారీ జాబ్‌మేళ.. 15కుపైగా కంపెనీల్లో 2 వేలకుపైగా ఉద్యోగాలు
Hyderabad Police Job Mela: హైదరాబాద్ సిటీ పోలీసు ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దాదాపు 15కుపైగా కంపెనీల్లో 2వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...
Hyderabad Police Job Mela: హైదరాబాద్ సిటీ పోలీసు ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దాదాపు 15కుపైగా కంపెనీల్లో 2వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదలైన సమయంలో అనేక మంది నిరుద్యోగులకు వివిధ పీఎస్‌ల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ శిబిరాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఇప్పుడు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్‌మేళాను హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ ఆర్గనైజ్ చేయనుంది. 20వ రేపు నిర్వహించే ఈ జాబ్‌మేళలో 15కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఆయా కంపెనీల్లోని 2 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగం, కంపెనీ ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేలకుపైగా వేతనం అందించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు 8333900131, 9490157542 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.