Rahul Gandhi visit: ఉద్యమాల అడ్డ ఓయూలో మళ్లీ టెన్షన్.. క్యాంపస్‌లో రాహుల్ టూర్‌పై సర్వత్రా ఉత్కంఠ
ఉద్యమాల అడ్డ ఓయూ.. మళ్లీ టెన్షన్ టెన్షన్‌గా మారింది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న క్యాంపస్ రాహుల్ టూర్ ఇష్యూతో పాత రోజులను గుర్తుకు తెస్తోంది.
Rahul Gandhi Osmania University visit: ఉద్యమాల అడ్డ ఓయూ.. మళ్లీ టెన్షన్ టెన్షన్‌గా మారింది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న క్యాంపస్ రాహుల్ టూర్ ఇష్యూతో పాత రోజులను గుర్తుకు తెస్తోంది. విద్యార్థుల నినాదాలు, రాళ్లదాడులు ఓ వైపు.. పోలీసుల లాఠీ చార్జీలు, అరెస్టులు మరో వైపు. ఇలా ఎటు చూసినా ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది.
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్‌ను క్యాంపస్‌కు తీసుకొచ్చి తీరుతామంటున్న కాంగ్రెస్ నేతలు.. అడ్డుకొని చూపిస్తామంటున్న టీఆర్‌ఎస్ మాటలతో యుద్ధవాతావరణం ఏర్పడింది. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాకే క్యాంపస్‌లో అడుగుపెట్టాలని అంటోంది.
రాహుల్ సమావేశానికి అనుమతి ఇవ్వాల్సిందేనని అంటున్న కాంగ్రెస్.. అందుకు తగ్గ యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే.. ప్రగతిభవన్‌తో పాటు మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓయూని పట్టించుకోని ప్రభుత్వం.. రాహుల్ రాకతో సమస్యలు బయటపడతాయనే భయంతోనే రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వడం లేదని ఆరోపించారు.
ఇప్పటికే సభ అనుమతిపై ఓయూ జేఏసీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఇవాళ విచారణకు రానుంది. కోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠగా ఉంది. రాహుల్ సభకు అనుమతి ఇస్తుందా? ఇస్తే ఎలాంటి కండిషన్లు పెడుతుంది? లేక.. పరీక్షల సీజన్‌లో అనుమతి ఇచ్చేందుకు కోర్టు ససేమీరా అంటుందా? మరో చోటు ఓయూ విద్యార్థులతో సమావేశం పెట్టుకోవాలని సూచిస్తుందా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Read Also… PM Modi Europe Visit: యూరప్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!