AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హతలేదు.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ

అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్‌కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు.

Asaduddin Owaisi: పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హతలేదు.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi
Noor Mohammed Shaik
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 10, 2025 | 3:46 PM

Share

అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్‌కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు. ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామంటూ పేర్కొన్నారు. పాకిస్థాన్ దృశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వసలహాదారుడు షబ్బీర్ అలీతో కలిసి ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు. భారతదేశం నుండి విడిపోయిన తరువాత పాకిస్తాన్.. ఇక్కడి హిందువులకు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు. పెహాల్గామ్‌లో కుటుంబ సభ్యుల ముందు అతికిరాతకంగా హతమార్చారు… అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారన్నారు. పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఒవైసీ అన్నారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని… సైనికులకు అండగా ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.

బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక భేటీ

శనివారం రాత్రి గం. 8.20కి బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు నడ్డా. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలపై ఎంపీలతో నడ్డా చర్చించనున్నారు. ఉద్రిక్తతల వేళ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం..

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..