ఎర్రమంజిల్ అసెంబ్లీ నిర్మాణంపై.. కోర్టుకెక్కిన నవాబులు..!

ఎర్రమంజిల్ అసెంబ్లీ నిర్మాణంపై నవాబు వారసులు పిటిషన్ వేశారు. నవాబు ఫక్రుల్ ముల్క్ వారసులు 8 మంది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎర్రమంజిల్‌లో ఉన్న ప్యాలెస్‌ని తమ అనుమతి లేకుండా కూల్చడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఎర్రమంజిల్‌లోని 12 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎర్రమంజిల్ స్థలంపై 1951 నుండి ఓ కేసు హైకోర్టులో కొనసాగుతుంది. హైకోర్టులో కేసు కొనసాగుతున్పప్పటికీ.. అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు నవాబు […]

ఎర్రమంజిల్ అసెంబ్లీ నిర్మాణంపై.. కోర్టుకెక్కిన నవాబులు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 08, 2019 | 1:36 PM

ఎర్రమంజిల్ అసెంబ్లీ నిర్మాణంపై నవాబు వారసులు పిటిషన్ వేశారు. నవాబు ఫక్రుల్ ముల్క్ వారసులు 8 మంది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎర్రమంజిల్‌లో ఉన్న ప్యాలెస్‌ని తమ అనుమతి లేకుండా కూల్చడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఎర్రమంజిల్‌లోని 12 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎర్రమంజిల్ స్థలంపై 1951 నుండి ఓ కేసు హైకోర్టులో కొనసాగుతుంది. హైకోర్టులో కేసు కొనసాగుతున్పప్పటికీ.. అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు నవాబు వారసులు.