అమితాబ్‌తో ఉన్న ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? పుష్ప 2లో తన అందంతో కవ్వించింది
సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అతి తక్కువ సమయంలోనే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటారు.
చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. కొంతమంది సైడ్ యాక్ట్రెస్ గా నటించి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి సినిమాలు చేశారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సంచలన హిట్ అందుకున్న పుష్ప సినిమాలోనూ నటించి మెప్పించింది ఈ అమ్మడూ. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో కనిపించింది ఆమె. అలాగే అమితాబ్ బచ్చన్ తోనూ నటించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. కుర్రాళ్లను తన క్రేజీ ఫొటోలతో కవ్విస్తూ ఉంటుంది ఆ చిన్నది.
ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు
ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పుష్ప సినిమాలో తన అందాలతో కవ్వించింది. ఇంతకూ పై ఫొటోలో అమితాబ్ తో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. ఆంచల్ ముంజల్. బాలీవుడ్ లో టెలివిజన్ తో పాటు పలు చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ. చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరకు పరిచయమైన ముంజల్.. 2008లో ‘ధూమ్ మచావో ధూమ్’ అనే సిరీస్‌తో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2010లో ‘వి ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఘోస్ట్ బనా దోస్త్’, ‘పర్వర్రిష్’, ‘గుమ్రః’, ‘వెల్కమ్’, ‘బడే అచ్చే లగ్తే హాయ్’, ‘ప్రెట్ బాయ్స్’ లాంటి టీవీ షోలలో నటించిన ఈమె.. ‘ఘాయల్: ఒన్స్ అగైన్’, ‘ఆరక్షన్’, ‘ముంబై స్పెషల్ 6’ వంటి చిత్రాల్లో కనిపించింది.
సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్
ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో మెరిసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఓ డీల్ కోసం మాల్ దీవ్స్ వెళ్లే సన్నివేశం ఉంటుంది. విలన్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది ఆమె. సినిమాలో ఈ అమ్మడు కనిపించింది ఒక్క సీన్ అయినప్పటికీ.. కుర్రాళ్ల ఈమె కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరాల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి