- Telugu News Photo Gallery Copper and brass items can be cleaned easily using these tips, Check Here is Details in Telugu
Kitchen Hacks: రాగి, ఇత్తడి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే.. ఇలా క్లీన్ చేయండి..
ప్రతీ ఇంట్లో రాగి, ఇత్తడి సామాన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వీటిని తరచూ ఉపయోగిస్తే శుభ్ర పరచడం కష్టమని పైన పెట్టేస్తారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేస్తారు. కానీ ఈ చిట్కాలు ఉపయోగించి క్లీన్ చేస్తే.. సెకన్లలోనే వస్తువులు తెల్లగా మెరుస్తాయి..
Updated on: Jan 11, 2025 | 7:24 PM

సంక్రాంతి పండుగ దగ్గర పడింది. ఈ ఏడాది 13వ తేదీ నుంచి పండుగ మొదలు కానుంది. పండక్కి ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంట్లోని అన్ని సామాన్లు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇత్తడి, రాగి వస్తువులను కూడా క్లీన్ చేస్తారు. వీటిని క్లీన్ చేయాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ ఈ చిట్కాలు ట్రై చేస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.

ఇంట్లో రాగి వస్తువులు ఉంటే మంచిదని బిందెలు, ప్లేట్లు, కొన్ని రకాల సామాన్లు కొంటూ ఉంటారు. రాగి వస్తువులపై మరకలు పడ్డాయంటే అంత ఈజీగా పోవు. కానీ ఈ చిట్కాలతో కొన్ని సెకన్లలోనే శుభ్రం చేయవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.

అందులో కొద్దిగా వెనిగర్ కలపండి. వెనిగర్ లేకపోతే పంచదార కలపండి. ఆ తర్వాత ఇందులో నిమ్మ రసం, కొద్దిగా ఉప్పు కలపండి. ఈ వాటర్‌తో రాగి వస్తువులను తోమితే తెల్లగా మెరుస్తాయి.

అదే విధంగా ఇత్తడి సామాన్లు కూడా ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. వీటిని తోమడం కష్టమని తరచూ ఉపయోగించారు. వీటిని కూడా చాలా సింపుల్‌గా శుభ్రం చేయవచ్చు.

ఒక గిన్నెలోకి కొద్దిగా టమాటా కెచప్, వెనిగర్, కొద్దిగా డిటర్జెంట్ కలిపి మొత్తం మిక్స్ చేయండి. దీంతో ఇత్తడి సామాన్లు రుద్దండి. కొన్ని సెకన్లలోనే ఇవి కూడా అప్పుడే కొన్న వాటిలా మెరుస్తాయి.




