లైట్ తీసుకోకండి.. అది సైలెంట్ కిల్లర్.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్లో ఉన్నట్లే..
అయోడిన్ లోపం అనేది 'సైలెంట్ కిల్లర్'.. దీని లక్షణాలు క్రమంగా బయటపడతాయి.. అయితే.. అయోడిన్ లోపాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.. వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అయోడిన్ లోపాన్ని 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు.. ఎందుకంటే దాని లక్షణాలు కొన్ని కనిపించవు.. ఇది కాలం గడుస్తున్న కొద్ది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది..
ఆధునిక జీవనశైలి, అసమతుల్య ఆహారం కారణంగా.. అయోడిన్ లోపం మరోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అయోడిన్ లోపాన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు.. ఎందుకంటే దాని లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి.. కొన్నిసార్లు దాని లక్షణాలను గుర్తించలేము. అయోడిన్ లోపం థైరాయిడ్ గ్రంధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.. దీని కారణంగా శరీరం.. అనేక ముఖ్యమైన విధులు ప్రభావితమవుతాయి.
అయోడిన్ శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం.. ఇది ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో దాని లోపం ఉంటే.. థైరాయిడ్ రుగ్మత, హైపోథైరాయిడిజం, గాయిటర్, బరువు పెరగడం, అలసట, మానసిక వికాసానికి ఆటంకం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. అయోడిన్ లోపం.. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలలో, పెరుగుదలను అడ్డుకుంటుంది.. మెదడు అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
అయోడిన్ లోపం ఎందుకు పెరుగుతోంది?
అయోడిన్ లోపం పెరగడానికి ప్రధాన కారణం ప్రజల అసమతుల్య ఆహారం.. అయోడిన్ అధికంగా ఉండే ఉప్పును తక్కువగా ఉపయోగించడం అని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు అయోడిన్ లోపాన్ని తొలగించడానికి అయోడిన్ అధికంగా ఉండే ఉప్పును తప్పనిసరి చేసేవారు. కానీ ఇటీవలి సంవత్సరాలలో ప్రజలు సాదా లేదా హిమాలయన్ ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. దీని కారణంగా శరీరానికి అవసరమైన అయోడిన్ లభించదని.. ఫలితంగా లోపం ఏర్పడతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అయోడిన్ లోపం లక్షణాలు
వైద్యుల ప్రకారం.. అయోడిన్ లోపం ప్రారంభ లక్షణాలు అలసట, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, చలిని తట్టుకోలేకపోవడం, నీరసంగా అనిపించడం.. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
వైద్యుల సలహా ఏంటంటే:
అయోడిన్ లోపాన్ని నివారించేందుకు ప్రజలు సమతుల్య ఆహారం తీసుకోవాలి..
అందులో అయోడిన్ అధికంగా ఉండే ఉప్పు తీసుకోవాలి..
అంతేకాకుండా.. సముద్రపు చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..
ఇది కాకుండా, గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు అయోడిన్ సప్లిమెంట్లను తీసుకోవాలని పేర్కొంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..