Telangana: 60 మందిలో ఆయనే టాప్…అద్భుత కళతో అందరినీ కట్టిపడేసిన చిత్రకారుడు!
చిత్రకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణలోని కాకతీయ శిల్పకళా వైభవానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన ఓ చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన చిత్ర కళను చూసినవారంతా అతని ట్యాటెంట్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు.

మాదాపూర్‌లోని ఆర్ట్స్ గ్యాలరీలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో టార్చ్, కళాయజ్ఞం సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తూన్న చిత్రకళా ప్రదర్శనలో చిత్రకారుడు కోటేష్ తన చిత్ర కళను ప్రదర్శించాడు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అరవై మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొనగా నంద్యాలకు చెందిన కోటకేష్ చిత్రకళకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం చిత్రకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఈ చిత్రకళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తూంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ చిత్రకారులను ఎంపిక చేసింది. ఎంపికైన చిత్రకారులు కాకతీయుల కాలంలోని శిల్పకళలు, కట్టడాలు, ఆలయాలను ప్రతిబింబించేలా చిత్రాల వెయ్యాలని సూచించింది. అందులో భాగంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వేసిన శిధిలమైన కాకతీయుల కట్టడాలు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోటేష్ వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని ఆర్ట్స్ గ్యాలరీలో ఈ నెల14 వరకు ఈ చిత్ర ప్రదర్శన జరగనుంది.
వీడియో చూడండి..
తన కళకు గుర్తింపు రావడం పట్ల కోటేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలుగు రాష్ట్రాలను పాలించిన కాకతీయులు ప్రజలకు మంచి పాలన అందించి అందరి మన్ననలు పొందారన్నారు. వారి పాలన కాలంలో ఉన్న కట్టడాలు, శిథిలమైన శిల్పాలు, ఆలయాలు ఇలా చిత్రాల ద్వారా లోకానికి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. తనకు ఈ అరుదైన అవకాశం ఇచ్చిన ప్రముఖ శిల్పి, చిత్రకారులు శేష బ్రహ్మంకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..