Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద కంగారుగా సినిమా ఆర్టిస్ట్.. ఏంటా అని ప్రశ్నించగా
అతనికి సినిమాలు అంటే ఇష్టం.. ఆ మక్కువతోనే చదువు మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చాడు. వెండితెరపై వెలిగిపోవాలని కలలు కన్నాడు. కానీ అవకాశాలు రాలేదు. దీంతో తప్పుడు దారి పట్టాడు.
సినిమాల్లో కనిపించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ అదృష్టం అందరికీ దొరకదు. టాలెంట్‌తో పాటు డెడికేషన్, పేషెన్స్ ఉండాలి. మనదైన రోజు కోసం ఎదురుచూస్తూ.. హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు సాగాలి. మనం ఎక్కాల్సిన ట్రైన్ లేట్ అవ్వొచ్చు కానీ రావడం మాత్రం పక్కా. కానీ అంత ఓర్పు లేని కొందరు అడ్డదార్లు తొక్కుతుంటారు. ఒత్తిడిలో, నిరాశలో.. మద్యపానం ఇతర చెడు అలవాట్లకు లోనవుతుంటారు. అలా ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్నారు. అలానే సిల్వర్ స్క్రీన్‌పై తన మార్క్ చాటాలని కలలుగన్న ఓ యువకుడు.. గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టబడ్డాడు. డీటేల్స్‌లోకి వెళ్తే.. వైజాగ్‌కు చెందిన 33 ఏళ్ల లాండ్ అశోక్ కుమార్.. టెన్త్ వరకు చదివాడు. సినిమాలపై ఇష్టం ఉండటంతో.. చదువు ఆపేసి హైదరాబాద్ వచ్చేశాడు. కృష్ణానగర్‌లో ఉండి వేషాల కోసం ప్రయత్నించాడు.
నటుడిగా సరైన అవకాశాలు రాకవడంతో.. జూనియర్ ఆర్టిస్టుగా షూటింగ్స్ వెళ్లడం షురూ చేశాడు. మంచి నటుడు అవ్వాలన్న తన ఆశలు కల్లలుగా మారడంతో మద్యానికి బానిసయ్యాడు. తన వ్యసనాలకు డబ్బు కావాల్సి రావడంతో అడ్డదార్లు తొక్కాడు. విశాఖ నుంచి గంజాయి తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, మైత్రివనం ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. తాజాగా జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండటంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి వ్యవహారం బయటపడింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..