- Telugu News Photo Gallery GHMC Commissioner Amrapali makes surprise inspection on sanitation in Hyderabad See Pics
Hyderabad: అట్టా అయితే ఇక కుదరదు.. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి.. ఉదయాన్నే ఆకస్మిక తనిఖీలు..
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుధ్యం అటకెక్కింది.. చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. డెంగ్యూ ముప్పు ఉందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.
Updated on: Jul 04, 2024 | 2:09 PM

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుధ్యం అటకెక్కింది.. చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. డెంగ్యూ ముప్పు ఉందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. శానిటేషన్ పరిశీలన కోసం బుధవారం ఉదయాన్నే ఆమ్రపాలి.. పలు ప్రాంతాల్లో పర్యటించి.. స్వయంగా పారిశుధ్య నిర్వహణ చర్యలను పర్యవేక్షించారు.

కమిషనర్ నారాయణగూడ క్రాస్ రోడ్ వద్ద శానిటేషన్ పై ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ నిర్మించిన మార్కెట్ గదులను కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జోనల్ కమీషనర్ ను ఆదేశించారు. శంకర్ మట్ వద్ద రాంకీ ఆర్ ఎఫ్ సీ వెహికిల్ డ్రైవర్ తో కమిషనర్ మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్ రైతు బజార్ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ ఆమ్రపాలి.. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

అటుగా వస్తున్న విద్యార్థినితో మాట్లాడిన కమిషనర్ ఆమ్రపాలి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను స్వచ్ఛ ఆటో లకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేసే విధంగా ప్రయత్నించాలని కమిషనర్ విద్యార్థినికి వివరించారు. కమిషనర్ వెంట శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.

ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్ రవి కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.




