Munnuru Ravi: టీఆర్ఎస్ ప్లీనరీలో శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు నిందితుడు హల్‌చల్.. ఫోటో వైరల్..
టీఆర్‌ఎస్ ప్లీనరీలో మున్నూరు రవి ప్రత్యక్షమవడం కలకలం రేపింది. శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో మున్నూరు రవి నిందితుడుగా ఉన్నాడు.
టీఆర్ఎస్ ప్లీనరీలో మున్నూరు రవి ప్రత్యక్షమవడం కలకలం రేపింది. శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో మున్నూరు రవి నిందితుడుగా ఉన్నాడు. సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులున్నా ఎలా వచ్చాడని ఆరా తీస్తున్నారు. పార్టీ నేతలతో ఫొటోలు కూడా దిగాడు. ఐడీ కార్డుతో ప్లీనరీ హాల్‌లోకి ప్రవేశించిన్నట్లు గుర్తించారు. ఇప్పుడు పొలిటికల్‌గా ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఇష్యూపై పొలిటికల్ కామెంట్స్ నడుస్తుండగానే, విచారణ ప్రారంభించారు పోలీసులు. ఇదంతా గతం ముచ్చటైనా, మళ్లీ ఓ వ్యక్తి ఎంట్రీతో ఇది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి, టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో కనిపించడం చర్చగా మారింది. హై సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులు ఇచ్చినా, మున్నూరు రవి ఎలా ప్లీనరీకి వచ్చారని అరా తీశారు పార్టీ నేతలు. అయితే, ఐడెంటిటీ కార్డ్ తోనే ప్లీనరీ హాల్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది.
అక్కడ కొందరు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మున్నూరు రవి ఫోటోలు దిగడం ఇప్పుజడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి అక్కడే ఉండటం చర్చనీయాంశమైంది. శ్రీనివాస్ గౌడ్ తమను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, గతంలో రాఘవేంద్ర రాజ్ కుటుంబం ఆరోపించింది. ఆర్ధికంగా దెబ్బతినడంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరెస్టు వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడని రాఘవేందర్ రాజు సోదరులు భావించారు. అందుకే, శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. రాఘవేందర్ రాజు కుటుంబానికి ఉన్న ఆధార్ సెంటర్‌తో పాటు బార్‌ను నడపకుండా చేయడంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించినట్టుగా అనుమానించారు. అటు ఆర్మీలో పనిచేసిన తన తండ్రికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డుకొన్నారని, హత్యకు కుట్ర కేసులో ప్రధాన నిందితుడు మున్నూరు రవి ఆరోపించారు. ఆ కేసు విచారణ జరుగుతుండగానే, రవి ప్లీనరీలో కనిపించడం కలకలం రేపింది.