Petrol Diesel Price: ఇదేందయ్యా ఇది.! పెట్రోల్, డీజిల్ రేట్లు అక్కడిలా.. ఇక్కడిలా..
గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే...
గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీజేపీ యేతర రాష్ట్రాల పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల పెరుగుదల అంశాలపై నేరుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం గత నవంబర్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కూడా అభ్యర్థించారు. ఈ రాష్ట్రాన్నీ విమర్శించాలని ఈ వ్యాఖ్యలు చేయడం లేదంటూనే.. పలు రాష్ట్రాల పేర్లు ప్రస్తావిస్తూ వ్యాట్ తగ్గించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని అభ్యర్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.67గా ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.27.90, రూ.21.80గా ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి.. బీజేపీయేతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా..
రాష్ట్రం | పెట్రోల్ (లీటర్‌కు) | డీజిల్(లీటర్‌కు) |
ఉత్తరప్రదేశ్ (లక్నో) | 105.25 | 96.83 |
మధ్యప్రదేశ్ (భోపాల్) | 118.14 | 101.16 |
బీహార్ (పాట్నా) | 116.23 | 101.16 |
గుజరాత్ (గాంధీనగర్) | 105.29 | 99.64 |
కర్ణాటక (బెంగళూరు) | 111.09 | 94.79 |
గోవా (పనాజీ) | 106.45 | 97.33 |
హిమాచల్ ప్రదేశ్ (షిమ్లా) | 105.60 | 89.42 |
త్రిపుర (అగర్తల) | 108.29 | 95.28 |
ఉత్తరాఖండ్ (డెహ్రాడూన్) | 103.73 | 97.34 |
హర్యానా(గుర్‌గ్రామ్) | 105.86 | 97.10 |
బీజేపీయేతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అలా..
రాష్ట్రం | పెట్రోల్ (లీటర్‌కు) | డీజిల్(లీటర్‌కు) |
మహారాష్ట్ర(ముంబై) | 120.51 | 104.77 |
పశ్చిమ బెంగాల్(కోల్‌కతా) | 115.12 | 99.83 |
జార్ఖండ్(రాంచీ) | 108.71 | 102.02 |
ఆంధ్రప్రదేశ్(విజయవాడ) | 120.86 | 106.50 |
తెలంగాణ(హైదరాబాద్) | 119.49 | 105.49 |
తమిళనాడు(చెన్నై) | 110.85 | 100.94 |
కేరళ(తిరువనంతపురం) | 117.19 | 103.95 |
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Viral: ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన వ్యక్తి.. తీరా ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!
Viral Photo: మీ కళ్లకి ఓ పరీక్ష.. ఈ ఫోటోలో దాగున్న సంఖ్యను చెప్పగలరా.? గుర్తిస్తే మీరే గ్రేట్!