Ajay Devgan vs Sudeep: అజయ్ దేవగణ్, కిచ్చ సుదీప్ ట్విట్టర్ వార్.. బాలీవుడ్ హీరోకు కౌంటరిచ్చిన మాజీ సీఎం సిద్ద రామయ్య..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ (Ajay Devagn), కన్నడ హీరో కిచ్చా సుదీప్ మధ్య హిందీ భాషపై ట్వీట్టర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ (Ajay Devagn), కన్నడ హీరో కిచ్చా సుదీప్ మధ్య హిందీ భాషపై ట్వీట్టర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ వ్యాఖ్యనించినట్లు వచ్చిన వార్తలపై దుమారం చెలరేగింది. జాతీయ భాష కానప్పుడు హిందీలో డబ్ చేస్తున్నారు కదా.. హిందీ ఎప్పటి నుంచో ఉంది అంటూ కౌంటరిచ్చాడు అజయ్. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అజయ్ , సుదీప్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్తాయిలో జరిగింది. ట్రాన్స్‌లేషన్‌లో పొరపాట్ల వలన ఇలా అపార్థం చేసుకున్నారంటూ సుదీప్ చెప్పుకొచ్చాడు.. అయితే వీరిద్దరి మధ్య ట్వీట్టర్ వార్ జరుగుతుండగా.. తాజాగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య హిందీ భాష జాతీయ భాష కాదంటూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు కౌంటరిచ్చారు.
” హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్యం. ప్రతి భాషకు దాని ప్రజలు గర్వించదగిన గొప్ప చరిత్ర ఉంది. నేను కన్నడిగ అయినందుకు గర్విస్తున్నాను!!” అంటూ ట్వీట్ చేశారు సిద్ద రామయ్య.
Hindi was never & will never be our National Language.
It is the duty of every Indian to respect linguistic diversity of our Country.
Each language has its own rich history for its people to be proud of.
I am proud to be a Kannadiga!! https://t.co/SmT2gsfkgO
— Siddaramaiah (@siddaramaiah) April 27, 2022
గతవారం ఓ చలన చిత్ర ప్రారంభోత్సవంలో కేజీఎఫ్ సినిమా రికార్డ్ బ్రేకింగ్ పాన్ ఇండియా విజయాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారని విలేకరి ప్రశ్నించగా.. హిందీ ఇకపై తమ జాతీయ భాష కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన కేజీఎప్ 2 సినిమా పాన్ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‌కు మించి ఉంటుందని..