KTR: ఆ స్కైవే నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. కేంద్రమే సహకరించడం లేదు. కేటీఆర్ ట్వీట్..
KTR: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పొలిటిషియన్స్‌లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఒప్పిగ్గా సమాధానం ఇస్తుంటారు..
KTR: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పొలిటిషియన్స్‌లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఒప్పిగ్గా సమాధానం ఇస్తుంటారు. సమస్యల పరిష్కారానికి అక్కడిక్కడే అధికారులకు సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టీవీ9 రిపోర్టర్ అగస్త్య కంటూ చేసిన ఓ ట్వీట్‌కు మంత్రి స్పందించారు.
జేబుస్ నుంచి కరీంనగర్‌కు వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉందని, ఈ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని టీవీ9 రిపోర్టర్ అగస్త్య ట్వీట్ చేశారు. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి అల్వాల్ వరకు స్కైవే నిర్మాణంపై దృష్టిసారిస్తే ప్రయాణికులకు గంట ప్రయాణ సమయం ఆధా అవుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన మంత్రి రీట్వీట్ చేశారు.
ఈ విషయమై కేటీఆర్ స్పందిస్తూ.. ఎస్ఆర్‌డీపీ (Strategic Road Development Project) కింద స్కైవే నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ కంటోన్మెంట్ ఏరియాలో అవసరమైన ల్యాండ్ ఇవ్వడంలో కేంద్రం సహకారం అందించడం లేదు. ఆరేళ్ల నుంచి తమ ప్రతిపాదనలను వినిపిస్తున్నా ఢిల్లీ పెద్దలు వినిపించుకోవడం లేదు అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
We are ready to build a skyway under SRDP from HMDA but unfortunately Govt of India (MoD) doesn’t want to support by way of offering land needed for road widening in Cantonment area
Strange but 6 years of repeated requests are falling on deaf ears of powers in Delhi https://t.co/vqjxd4z7TB
— KTR (@KTRTRS) January 30, 2022
Also Read: Job Fraud: వీడు మాములోడు కాదు.. ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. రూ. కోట్లు వసూళ్లు..
Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..