Hyderabad: లక్షా 70వేల బియ్యం గింజలపై శ్రీరామ నామం రాసిన వందన
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి.. శ్రీరామనామం దేశమంతా మార్మోగుతోంది. అంతటా ఆధ్యాత్మిక వాతావరణమే.. భద్రాద్రిలో కల్యాణ సంరంభం నెలకొంది. రామ భక్తులు తమదైనశైలితో తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒక భక్తురాలు బియ్యగింజలపై శ్రీరామనామం రాసి ఆలయాలకు పంపిస్తుండగా మరోవైపు సిరిసిల్లా నేతకళాకారుడు సీతమ్మవారికి బంగారు పట్టుచీరను సమర్పిస్తున్నాడు.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

రాముని హృదిమెచ్చి కార్యమేచేతుగా అంటూ.. భక్తులు తమతమ మధిలో సీతారాములను నిల్పుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలకు హైదరాబాద్‌కు చెందిన మినియేచర్ ఆర్టిస్ట్ వందన ఆదివారం జరుగనున్న సీతారాముల కల్యాణానికి లక్షా 75 వేల బియ్యం గింజలపై శ్రీ రామ నామాన్ని రాసి సిద్ధం చేశారు.
బియ్యం గింజలను భద్రాద్రికి పంపించనున్న వందన
రామం నామం రాసిన ఈ బియ్యం గింజలను భద్రాద్రి ఆలయంతో సహా 60 ఆలయాలకు పంపించనున్నారు వందన. ఈ కళలో తొలుత అడ్డంకులు ఎదురైనప్పటికి రాముని అనుగ్రహంతో ముందుకుసాగుతున్నాని చెబుతున్నారు వందన.
తొమ్మిదేళ్లనుంచి మినియేచర్ ఆర్ట్‌లో రాణిస్తున్న వందన
ప్రతి ఒక్కరు రామనామం స్మరించాలి, ప్రతి ఇంట రామనామం మార్మోగాలి అన్న సంకల్పంతో శ్రీరామనామం బియ్యపు గింజలపై లిఖించడం ప్రారంభించానంటున్నారు వందన. తొమ్మిదేళ్లనుంచి మినియేచర్ ఆర్ట్‌తో రాముడిపై తన భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పటివరకు 10 లక్షల 50 వేల బియ్యపు గింజలపై శ్రీ రామ అక్షరాలను రాసి ఆలయాలకు సమర్పించారు. 14 ఏళ్ల పాటు రాముడు వనవాసం వెళ్లినదానికి గుర్తుగా 14 ఏళ్ల పాటు బియ్యం గింజలపై శ్రీరామ నామం రాస్తానంటున్నారు వందన.
దేశవ్యాప్తంగా 128 ఆలయాలకు అందజేత
ప్రతీ ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలంటున్న వందన ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 128 ఆలయాలకు శ్రీరామ అని రాసిన బియ్యం గింజలు అందించారు. బాల్యంనుంచే తాను రామభక్తురాలినంటున్న వందన పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో ఈ కళలో రాణిస్తున్నాని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
