Hyderabad MD: డీపీఆర్ ను బయటకు ఇస్తే.. కేసులు వేసేందుకు రెడీ గా ఉన్నారు.. ఎండీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఫేస్-2 కోసం రెండు డీపీఆర్ లను కేంద్రానికి పంపించామన్న ఆయన.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ఆలోపు...

Hyderabad MD: డీపీఆర్ ను బయటకు ఇస్తే.. కేసులు వేసేందుకు రెడీ గా ఉన్నారు.. ఎండీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Hyderabad Metro
Follow us

|

Updated on: Dec 08, 2022 | 5:10 PM

హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఫేస్-2 కోసం రెండు డీపీఆర్ లను కేంద్రానికి పంపించామన్న ఆయన.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ఆలోపు రూ.6,250 కోట్లతో రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రూట్ ను నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. మైండ్ స్పేస్ వద్ద స్టార్ట్ అయ్యే లైన్.. ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. డీపీఆర్ ను బయటకు ఇస్తే వివిధ కారణాలతో కేసులు అయ్యి.. పనులు జరగడం లేదన్నారు. ఈ కారణంగా డీపీఅర్ ను బయటికి ఇవ్వకుండా కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. డీపీఅర్ బయటికి ఇస్తే కేసులు వేయడానికి రెడీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులతో సిటీ మెట్రో 6 నెలలు ఆగిపోయిందని తెలిపారు. సిటీ మెట్రో కి ఎన్నో అడ్డంకులు వచ్చాయన్న ఆయన.. ఎయిర్ పోర్ట్ మెట్రో కి అలాంటి అవకాశం లేదని వివరించారు. సిటీ బయటి నుంచి వెళ్తున్నందున ఎక్కడా ల్యాండ్ కి ప్రాబ్లం లేదు లేదని, బయోడైవర్సిటీ వద్ద ఇప్పటికే రెండు లెవెల్స్ ఫ్లై ఓవర్లు ఉన్నాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో సమర్పించామని.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో.. సిటీ మెట్రో తో పోలిస్తే ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని.. స్పీడ్ లిమిట్ కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సిటీలో 80 కిలోమీటర్ల మాక్సిమం స్పీడు ఉంటే ఎయిర్ పోర్ట్ మెట్రో 120 కిలోమీటర్ల హై స్పీడ్ తో వెళ్తుందని చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ప్రారంభమై బయోడైవర్సిటీ వద్ద ప్రస్తుతమున్నటువంటి రెండు ఫ్లైఓవర్ల పైన మెట్రో లైన్ అలైన్మెంట్ వస్తుందని అక్కడి నుంచి ఖాజా గూడా మీదుగా నానాక్ రామ్ గూడ వద్ద ఓఆర్ఆర్ పక్క నుంచి నేరుగా నార్సింగ్, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు వెళుతుందని చెప్పారు.

తొలిసారి ఎయిర్ పోర్ట్ వద్ద అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మాణం చేపడుతున్నాం. ఎయిర్ పోర్ట్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ సాధ్యం కాదని అందులో భాగంగా అండర్ గ్రౌండ్ నిర్మాణంతో నేరుగా ప్రయాణికులను ఎక్కడైతే బోర్డింగ్ గేట్స్ ఉంటాయో అక్కడికి చేరవేసేలా 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో వస్తుంది. 27.5 కిలోమీటర్లు కారిడార్ కాగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లేందుకు ఒక కిలోమీటర్ రాంపు తరహాలో ఉంటుంది. మరొక రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ తో ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. సిటీలో మెట్రో పనులు ప్రారంభించినప్పుడు డీపీఆర్ బహిర్గతం చేయడం వల్ల కోర్టులో వేసి పనులు ఆలస్యం అయ్యేలా చేశారు. ఇప్పుడు కూడా కొంత మంది కాచుకు కూర్చున్నారని ఎన్వీస్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

        – ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో ఎండీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..