Minister KTR: మంత్రి కేటీఆర్ మెడలో పసుపు కండువా.. విషయం ఏంటో తెలుసా..
తెలంగాణ భవన్‌కు వచ్చిన తమిళనాడు ఎంపీలు ముందుగా మంత్రి కేటీఆర్‌ను పచ్చ కండువాతో సత్కరించారు. సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ రాసిన లేఖను డీఎంకే ఎంపీలు కేటీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా..
తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను డీఎంకే పార్టీ ఎంపీలు కలిశారు. సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ రాసిన లేఖను డీఎంకే ఎంపీలు మంత్రి కేటీఆర్‌కు అందించారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన తమిళనాడు ఎంపీలు ముందుగా మంత్రి కేటీఆర్‌ను పచ్చ కండువా(డీఎంకే కండువా)తో సత్కరించారు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు పసుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. అదే ఆ కిరణాలను ఆ పార్టీ రంగుగా భావిస్తుంటుంది. ఆ కండువాకు కూడా తమిళనాడువాసులు గౌరవం ఇస్తుంటారు. సందర్భం ఏంటంటే.. నీట్ రద్దు కోరుతూ పలువురు సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా తమిళనాడు సీఎం లేఖను రాశారు. ఆ లేఖను మంత్రి కేటీఆర్‌కు డీఎంకే ఎంపీలు ఎల్‌ఎం గోవింద్, వీరస్వామి అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు డీఎంకే ఎంపీలు పేర్కొన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు డీఎంకే ఎంపీలు వెల్లడించారు.
కేంద్ర ప్రవేశపెట్టిన నీట్ పరీక్షను అడ్డుకునేందుకు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారు. విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు తమిళనాడు సీఎం స్టాలిన్. అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ ఎంపీని పంపించారు. సీఎంలకు రాసిన లేఖలో నీట్‌పై వ్యతిరేకత తెలియచేశారు స్టాలిన్.
ఇవి కూడా చదవండి: Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..