AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘రేపటి కోసం’.. మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో గొప్ప కార్యక్రమం

తెల్లాపూర్‌ క్యాంపస్‌లో జూనియర్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించారు. జూనియర్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ (MIST JMUN 2024) మొదటి ఎడిషన్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ క తెల్లాపూర్ క్యాంపస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని దాదాపు 20 పాఠశాలల నుంచి 4 నుండి 8 తరగతుల విద్యార్థులు...

Hyderabad: 'రేపటి కోసం'.. మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో గొప్ప కార్యక్రమం
Meru school
Narender Vaitla
|

Updated on: Aug 30, 2024 | 2:02 PM

Share

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది ప్రముఖ విద్యా సంస్థ మేరు ఇంటర్నేషనల్‌. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్‌ మోడల్ యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిందీ స్కూల్‌.

తెల్లాపూర్‌ క్యాంపస్‌లో జూనియర్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించారు. జూనియర్ మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ (MIST JMUN 2024) మొదటి ఎడిషన్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ క తెల్లాపూర్ క్యాంపస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని దాదాపు 20 పాఠశాలల నుంచి 4 నుండి 8 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. సంగీతం, నృత్యంతో పాటు పలు దేశాలకు చెందిన జెండాలతో ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Meru School

మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఫౌండర్ డైరెక్టర్ శ్రీమతి మేఘన గోరుకంటి జూపల్లి ఈ సందర్భంగా స్వాగతం పలికి విద్యార్థులను చైతన్య పరిచారు. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్‌లో పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ శ్రీమతి ఎమిలియా బి. స్మిత్ దౌత్యం గురించి మాట్లాడారు. సెక్రటరీ జనరల్ కూడా విద్యార్థులను విమర్శనాత్మకంగా ఆలోచించాలని, స్పష్టతతో మాట్లాడాలని పిలుపునిచ్చారు. UNHRC, UNEA, WEF, WHO, MOM, UNICEFతో పాటు లోక్‌సభ వంటి వివిధ కమిటీల ద్వారా దాదాపు 300 మంది విద్యార్థులు ప్రపంచ సమస్యలపై చర్చల్లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌ మంచి విజయాన్ని సాధించిందని, విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయడంలో, రేపటి సమాజ నిర్మాణంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..