Hyderabad: 5 లక్షలు పెట్టండి… రెండేళ్లలో 10 లక్షలు పట్టుకెళ్లండి.. కట్ చేస్తే…

స్కీమ్.. అధిక వడ్డీ అనగానే ఓ ఎగేసుకోని వెళ్లిపోకండి.. మీరు నిండా మునిగిపోతారు జాగ్రత్త. తాజాగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తామని అమాయకుల చేత పెట్టుబడులు పెట్టించిన నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.

Hyderabad: 5 లక్షలు పెట్టండి... రెండేళ్లలో 10 లక్షలు పట్టుకెళ్లండి.. కట్ చేస్తే...
Cash
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 15, 2024 | 6:28 PM

డబ్బులు బ్యాంకులో వేస్తే… ఓ పదేళ్లలో రెట్టింపు అవుతుంది. అదేకొన్ని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో డిపాజిట్‌ చేస్తే… అక్కడ కూడా ఓ ఏడెనిమిది సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. కానీ అవే డబ్బులు మీరు మా స్కీంలో పెడితే… జస్ట్‌ 25 నెలల్లోనే డబుల్‌ అయిపోతాయ్‌ అంటూ సరికొత్త స్కామ్‌కి తెరలేపాడో కేటుగాడు. 5 లక్షలు పెట్టండి… రెండేళ్లలో 10 లక్షలు పట్టుకెళ్లండంటూ నిండా ముంచాడు.

షార్ట్‌ టర్మ్‌… బిగ్ రిటర్న్స్ అంటూ ఏకంగా 3వేల 600 మందిని మోసం చేసి…ఈజీగా 300 కోట్ల రూపాయలు వసూలు చేశాడో కంత్రి. ఈ మోసం హైదరాబాద్ సిటీ నడిబొడ్డు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగింది. బాధితుల కంప్లయింట్స్‌తో ఆ కేటుగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

వెల్త్ కాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించిన పవన్ అనే వ్యక్తి.. 25నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీం ప్రారంభించి పెట్టుబడిదారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సొమ్మును రాబట్టాడు. ఈ స్కీంలో భాగంగా కస్టమర్ల చేత 8 లక్షలకు రెండు గుంటల భూమి కొనుగోలు చేయించాడు పవన్. ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని నెలలు బాగానే సాగింది యవ్వారం. క్రమం తప్పకుండా కొన్ని నెలలు లాభాలు ఇచ్చి ఆపై మొహం చాటేశాడు. కొన్నాళ్ల తర్వాత లాభాలు ఇవ్వకపోవడం, పవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పవన్‌ను, అతడికి సహకరించిన మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…   

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!