TGPSC Group 4 Selection List: టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 పోస్టుల ఎంపిక జాబితాలో 96 పోస్టులకు కోత.. కారణం ఇదే

తెలంగాణ గ్రూప్ 4 పోస్టుల తుది ఎంపిక జాబితా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే మొత్తం పోస్టుల్లో 96 పోస్టులు ఖాళీగా మిగిలిపోయినట్లు కమిషన్ వెల్లడించింది. ఇందుకు కారణం ఏంటంటే..

TGPSC Group 4 Selection List: టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 పోస్టుల ఎంపిక జాబితాలో 96 పోస్టులకు కోత.. కారణం ఇదే
TGPSC Group 4 Selection List
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 15, 2024 | 4:07 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 15: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 8,180 గ్రూప్‌-4 సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 పోస్టుల తుది ఫలితాలను గురువారం వెల్లడించింది. మొత్తం 8,084 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపింది. దాదాపు రెండేళ్ల పాటు కొనసాగిన ఈ నియామక ప్రక్రియ ఇంతటితో పూర్తైనట్లైంది. కొలువులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారీగా వెల్లడించింది. అయితే మొత్తం పోస్టుల్లో 96 పోస్టులను మాత్రం ఖాళీగా ఉంచినట్లు కమిషన్‌ తెలిపింది. 59 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో మరో 37 పోస్టులు భర్తీ కాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ వివరించారు. ఎంపికైన వారిలో ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించినట్లు రుజువైతే వారి ఎంపిక రద్దుచేస్తామన్నారు.

తెలంగాణ గ్రూప్ 4 ఫైనల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్‌బీఐ ఎస్‌ఓ ఎగ్జామ్‌ అడ్మిట్‌కార్డులు.. నవంబర్ 23న నియామక రాత పరీక్ష

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ నియామక రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ రిజిస్ట్రేషన్‌ లేదా రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్‌ 23వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.