AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సమగ్ర కులగణన సర్వేలో మీరిచ్చే సమాచారం గోప్యమేనా..?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సమగ్ర కులగణన (Telangana Caste Census)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

Telangana: సమగ్ర కులగణన సర్వేలో మీరిచ్చే సమాచారం గోప్యమేనా..?
Telangana Caste Census
Sravan Kumar B
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 6:57 PM

Share

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సమగ్ర కులగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆస్తి వివరాలు అందులో స్థిరాస్తులు, చరాస్తులు, అప్పులు, ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉంటే ఎటువంటి నేపథ్యం, విద్యార్హతలు ,కులం ,మతం ,మాతృభష ఇలా మొత్తం సమాచారం సేకరిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మీకు సంబంధించిన ప్రతి సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది. బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ ఉందా లేదా ఇలాంటి సమాచారం కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. అందుకే ప్రజలకు తామిచ్చే సమాచారంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారం సేకరించిన తర్వాత ప్రభుత్వం నుంచి తమకు వచ్చే పథకాలు కొన్నింటిని తీసేస్తారనే అపోహలు ఉన్నాయి. అంతేకాకుండా సమాచారం వివిధ దశల్లో ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే ఎన్యుమరేటర్లు గా ప్రభుత్వ సిబ్బంది సమాచారం సేకరిస్తున్నారు. ఈ సమాచారం అంత ప్రభుత్వం వద్దకు చేరిన తర్వాత దీన్ని కంప్యూటర్లో భద్రపరుస్తారు.

75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అంతా కూడా కేవలం కోడ్ రూపంలో మాత్రమే నమోదు చేస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఉదాహరణకు మీకు స్థిర చరాస్తులు ఉన్నాయా అనే కాలంలో ఉన్నాయి అంటే ఒక కోడ్ లేవు అంటే ఇంకో కోడ్ తో నమోదు చేస్తున్నారు. అంతే తప్పితే స్థిరాస్తులు చరాస్తులు పూర్తి వివరాలు సేకరించట్లేదు. బ్యాంక్ ఎకౌంట్ కు సంబంధించిన వివరాల కాలంలో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే కోడ్ రూపంలో నమోదు చేస్తున్నారు తప్పితే బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగటం లేదు.

Telangana Caste Census

Telangana Caste Census

అయితే చాలామందికి తాను ఇచ్చే ఆధార్ నెంబర్ భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఆధార్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఆధార్ నెంబర్ కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆధార్ నెంబర్ ఉంటే ప్రభుత్వ పథకాలు అందించేందుకు సులువుగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ నెంబర్ ఇవ్వటం ఇష్టం లేకపోతే ఏన్యుమరేటర్లు తీసుకోరు. సమాచార సేకరణలో ప్రజలు ఏ సమాచారాన్ని చెబితే ఆ సమాచారం మాత్రమే నమోదు చేస్తున్నామని మంత్రులు పదేపదే చెబుతున్నారు. సమాచారం సేకరించేటప్పుడు ఎన్యుమేటర్లు ఎవరూ కూడా పౌరులను సమాచారం కోసం బలవంత పెట్టరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సమాచారం సేకరించే ప్రతి దశలో గోప్యత తో పాటు సమాచార భద్రత ఉండేలా సమాచారం సేకరించేటప్పుడు కేవలం ఉంది లేదు అనే సమాచారాన్ని కోడ్ రూపంలో మాత్రమే సేకరిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఈ డేటా  ప్రభుత్వానికి చేరిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో భద్రపరుస్తామని ఆ సమాచారాన్ని యాక్సిస్ చేసే అవకాశం ప్రభుత్వంలో కేవలం ఒకరు లేదా ఇద్దరికీ మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.. కాబట్టి పౌరులకు ఎటువంటి సందేహాలు లేకుండా తమ సమాచారాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంటే భవిష్యత్తులో నూతన పథకాలను రూపకల్పన చేసేందుకు, సరైన అర్హులను గుర్తించేందుకు, అమలు చేసేందుకు, పారదర్శకత పాటించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.