AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరి దేవుడా.. మార్నింగ్ వాక్‌కి వెళ్తే మృత్యువు వెంటాడింది..!

ఓ యువకుడికి మార్నింగ్ వాక్ వెళ్లాడమే పాపం అయిపోయింది. స్నేహితులతో కలిసి ఎప్పటిలాగే ఉదయం నడకకు వెళ్లిన ఓ యువకుడిని వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికికక్కడే ఆ యువకుడు మృతి చెందాడు.

Telangana: ఓరి దేవుడా..  మార్నింగ్ వాక్‌కి వెళ్తే మృత్యువు వెంటాడింది..!
A Person Went For A Morning Walk Was Hit By A Car In Adilabad
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 7:03 PM

Share

ఆరోగ్యం కోసం మార్నింగ్ వాక్ వెళితే ఏకంగా ఆ యువకుడి ప్రాణాలే పోయాయి. స్నేహితులతో కలిసి ఎప్పటిలాగే ఉదయం నడకకు వెళ్లిన ఓ యువకుడిని వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికికక్కడే మృతి చెందాడు ఓ యువకుడు. ఈ ప్రమాద ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: వారెవ్వా.. ఏం టాలెంట్ గురూ..మిల్లెట్స్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ దంపతుల చిత్రం..

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొమ్మిడి అరుణ్ కుమార్ అనే (26) యువకుడు మార్నింగ్ వాక్ కు వెళ్లి కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతి రోజు లాగే ఉదయం 5గంటలకు వాకింగ్ కోసం వెంకట్రాపేట్ గ్రామానికి చెందిన తన స్నేహితులు రేగుంట దినాకర్, బొప్పూ విష్ణు, రేగుంట మహేష్ లతో కలిసి కొత్తూరు స్టేజి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా జన్నారం నుండి లక్షేట్టిపేట్ వైపు వేగంగా వెళుతున్న కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో మార్నింగ్ వాక్ చేస్తున్న అరుణ్ , రేగుంట మహేష్ లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు‌తీవ్రగాయాలై అరుణ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రేగుంట మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతిని తల్లి బొమ్మిడి మంజులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు‌ చేసిన పోలీసులు.. ప్రమాదానికి గురైన కారును‌ అదుపులోకి‌ తీసుకున్నారు. కారు నడిపిన మహ్మద్ సలమోద్దీన్ అనే వ్యక్తి‌పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన యువకుడి‌ కుటుంబ సభ్యులు.. చనిపోయి‌న తన కుమారుడి నేత్రాలను ఐ బ్యాంక్ కు డోనేట్ చేశారు.

ఇది చదవండి: 

మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా?..ఆ మంత్రిపై స్పీకర్ ఆగ్రహం..ఎందుకంటే?

జెట్ స్పీడ్‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు.. అందుబాటులోకి ఎప్పుడంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి