Hyderabad: ఛీ.. ఛీ.. వీడు తండ్రి కాదు.. మానవ మృగం.. కన్నకూతురిపైనే కన్నేసి దారుణంగా..
మృగాలు అడవిలో ఉండాలి. జనాలు ఊళ్లో ఉండాలి. మరి వీడెందుకు సమాజంలో ఉన్నాడు. వీడు మాములోడు కాదు.. క్రూర మృగాలకు మించిన మృగాడు. జైలులో ఉండే కరుడు గట్టిన క్రిమినల్స్ కన్నా ఎంతో డేంజరస్.. ఇతని నిర్వాకం తెలిస్తే వీడు మనిషేనా..! మనిషి పుట్టుకేనా...అని ఛీ కొట్టి ఉమ్మేస్తారవరైనా..! ఆకాశమంత ప్రేమను పంచే నాన్న అన్న పదానికే కళంకం తెచ్చాడీ కర్కోటకుడు.

మృగాలు అడవిలో ఉండాలి. జనాలు ఊళ్లో ఉండాలి. మరి వీడెందుకు సమాజంలో ఉన్నాడు. వీడు మాములోడు కాదు.. క్రూర మృగాలకు మించిన మృగాడు. జైలులో ఉండే కరుడు గట్టిన క్రిమినల్స్ కన్నా ఎంతో డేంజరస్.. ఇతని నిర్వాకం తెలిస్తే వీడు మనిషేనా..! మనిషి పుట్టుకేనా…అని ఛీ కొట్టి ఉమ్మేస్తారవరైనా..! ఆకాశమంత ప్రేమను పంచే నాన్న అన్న పదానికే కళంకం తెచ్చాడీ కర్కోటకుడు. తన ప్రతిరూపంపై.. తను పంచిన రక్త మాంసాలపై పంజా విసిరాడు. కొవ్వెక్కి.. కామంతో కళ్లుమూసుకుపోయి కన్నకూతురిపైనే కన్నేసిన వీడ్ని ఏమనాలి? ఏం చేయాలి?.. కడుపుకు అన్నం తింటున్నా సరే వీడి బుద్ది గడ్డి తింటున్నదని ఎవరైనా పసిగట్టి వుంటే మడతేసి మక్కెలిరగదీసేవాళ్లు. కానీ గమనించేలోపే బంగారు తల్లి జీవితం బలైపోయింది. మద్యానికే కాదు పోర్న్ వీడియోలకు బానిసైన నరేష్ అనే వీడు..తన కోరిక తీర్చమని కూతుర్ని వేధించాడు.
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు విచారణలో హంతక నరేష్ పైశాచికం బయటపడింది. మహూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ఎల్లంపేట నుంచి మియాపూర్‌కు వలస వచ్చారు నరేష్ కుటుంబం సభ్యులు. 15 రోజులు అయిందో లేదో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కన్నబిడ్డపై కన్నేసి.. చంపేశాడు. చిన్నారి మిస్సింగ్ కేసులో వైడ్ యాంగిల్‌లో విచారణ చేపట్టిన మియాపూర్ పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ సహా పక్కా ఆధారాలతో నిజాలను తెరపైకి తెచ్చారు. నరేష్ నిర్వాకం తెలిసి ఖాకీలు కూడా షాకయ్యారు.
కుటుంబ సభ్యులంతా బిడ్డ కన్పించడంలేదనే ఆందోళన పడుతుంటే.. వీడు మాత్రం గంట గంటకూ పాప శవాన్ని పాతి పెట్టిన చోటుకు వెళ్లి చూసి వచ్చేవాడట. తన గుట్టు బయటపడకండా అయ్యో బిడ్డా అంటూ గుండెలు బాదుకుంటూ డ్రామా రక్తి కట్టించాడు. దర్యాప్తును తప్పుదోవపట్టించబోయాడు.కానీ పక్కా ఆధారాలతో నరరూప రాక్షసనాన్నగాడ్ని కటకటాల బాటపట్టించారు మియాపూర్ పోలీసులు.
అసలేం జరిగిందంటే..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల క్రితం బానోతు వసంత అనే బాలిక కనిపించకుండా పోయింది. కిరాణా షాప్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి మియాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దాదాపు వారం రోజులు గడిచిన వసంత ఆచూకీ లభ్యం కాలేదు. ఈనెల 15న మియాపూర్ లో ఉన్న తండా వద్ద ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక బాలిక మృతదేహం కనిపించింది. వెంటనే మిస్సయిన బానోతు వసంత ఆనవాళ్లను వారి తల్లిదండ్రులకు చూపించడంతో తమ కూతురే అని నిర్ధారించుకున్నారు. అయితే ఎవరో వసంతను చంపేశారు అనేది అర్థమవుతున్నప్పటికీ ఆమెను ఎవరు చంపారు..? ఎందుకు చంపారన్న ప్రశ్న మాత్రం అందరినీ వెంటాడుతూ వచ్చింది. వసంత మృతిపై పలువురు ప్రజా సంఘాలు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటికే కరీంనగర్లో ఆరు సంవత్సరాల చిన్నారిపై వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం నడుస్తుంది. ఈ క్రమంలోనే మియాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అనుమానం వచ్చి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవం బయటపడింది.
కుటుంబంతో హైదరాబాద్ వచ్చిన నరేష్ స్థానికంగా కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.. పోర్న్ చూసే అలవాటు ఉన్న నరేష్ తన కోరికను కూతురిపై తీర్చుకోవాలని భావించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా చిన్నారి వసంత గట్టిగా కేకలు వేస్తూ అరిచింది.. దీంతో విషయం ఎక్కడ తన తల్లికి చెబుతుందని భయపడిన నరేష్ కుమార్తెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోని జుట్టు పట్టుకొని ఈడ్చి బలంగా కొట్టడంతో చిన్నారి వసంత చనిపోయింది. ఒక నిర్మానుష్య ప్రదేశానికి వసంత మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తిరిగి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ప్రతిరోజు వసంత మృత దేహం వద్దకు వెళ్లి చూసేవాడు.. అయితే.. ఎన్ని కోణాల్లో విచారించినా పోలీసులకి మొదట ఎలాంటి క్లూ లభించలేదు. లాభం లేకపోవటంతో కన్నతండ్రినే అనేక కోణాల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. సీసీ కెమెరాల దృశ్యాలు సైతం పరిశీలించాక కన్నతండ్రి ఈ ఘాతుకానికి ఒడికట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. బానోతు నరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
