Rain Alert: అదిరిపోయే న్యూస్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది.. దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది.. దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికిపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే.. హైదరాబాద్‌లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది.. రాత్రి 7 తర్వాత నగరంలో భారీ వాన కురిసే ఛాన్స్ ఉంది.. ఈ నేపథ్యంలో GHMC సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచింది..
ఏపీలో భారీ వర్షాలు..
అల్పపీడనం, రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది… మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచనలు చేశారు. రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
