AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో అమానుషం.. రూ.10 కోసం ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన ప్రయాణికుడు..!

హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. 10 రూపాయలు కోసం ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. రూ. 10 చెల్లించే విషయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర వాగ్వాదం తర్వాత ఆటో డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. దీంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ గురువారం ఆసుపత్రిలో మరణించాడు.

Hyderabad: పాతబస్తీలో అమానుషం.. రూ.10 కోసం ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన ప్రయాణికుడు..!
Auto
Balaraju Goud
|

Updated on: Jun 29, 2024 | 9:50 AM

Share

హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. 10 రూపాయలు కోసం ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. రూ. 10 చెల్లించే విషయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర వాగ్వాదం తర్వాత ఆటో డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. దీంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ గురువారం ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న గుర్తు తెలియని ప్రయాణికుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వట్టెపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అన్వర్ (39) జూన్ 12న చార్మినార్ వద్ద ఓ ప్రయాణికుడు తన ఆటో ఎక్కి షంషీర్‌గంజ్‌లో దింపాడు. షంషీర్‌గంజ్ చేరుకున్న తర్వాత, ప్రయాణీకుడు రూ.10 చెల్లించాడు, అయితే అన్వర్ మరో రూ.10 చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ప్రయాణికుడు అన్వర్‌ను దూషించడమే కాకుండా కనికరం లేకుండా తీవ్రంగా కొట్టాడు. ఇది గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రయాణికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అన్వర్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్వర్ జూన్ 27న మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నేలపై నడిచే బల్లి కంటపడిందా?.. అది మీకిచ్చే సంకేతమిదే..
నేలపై నడిచే బల్లి కంటపడిందా?.. అది మీకిచ్చే సంకేతమిదే..
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..