Hyderabad: ఆమెకు ముగ్గురు పిల్లలు.. అతనికి పెళ్లి కాలేదు.. వామ్మో.. చివరకు ఏం జరిగిందంటే..
రాష్ట్రాలు దాటి బ్రతుకుతెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చారు.. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు.. అతనికి పెళ్లి కాలేదు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది.. ఆ తర్వాత ఇద్దరూ ఓ ప్రాంతానికి వెళ్లారు.. అక్కడ ఇద్దరూ హత్యకు గురయ్యారు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పరిధిలో కలకలం రేపింది.. ఈ కేసులో సంచలన విషయాలను వెలుగు చూస్తున్నాయి..
హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.. అనంత పద్మనాభస్వామి ఆలయ సమీపంలోని గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని పోలీసులు గుర్తించారు. యువకుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ (25) గా, మహిళను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు దివాకర్ (25) గా గుర్తించారు. అయితే.. వివాహేతర బంధమే ప్రాణాలు తీసిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే.. డబుల్ మర్డర్ కు కొద్దిరోజుల ముందు బిందు, సాకేత్ అదృశ్యమైనట్టు వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో హత్యకు గురైంది వారిద్దరేనని పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమచారం..
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు, దివాకర్ దంపతులు… ఉపాధి కోసం కొంత కాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ దంపతులు మొదట్లో శంకర్‌పల్లిలో ఉండేవారు. దివాకర్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.. అయతే.. అక్కడ నివసించే సమయంలో హౌస్‌కీపింగ్ పనిచేసే సాకేత్‌తో బిందుకు పరిచయం ఏర్పడింది.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలిసి దివాకర్ తన కుటుంబాన్ని వనస్థలిపురంలోని చింతల్‌కుంటకు మార్చాడు.
అయితే.. ఆ తర్వాత కూడా వీరు కలుసుకునేవారు.. ఈక్రమంలోనే.. కొద్దిరోజుల క్రితం బిందు, సాకేత్ ఇళ్లనుంచి బయటకు వెళ్లిపోయారు.. భార్య కనిపించడం లేదని దివాకర్ ఈనెల 8న వనస్థలిపురంలో ఫిర్యాదు చేశాడు.. 11న సాకేత్ మాయమయ్యాడని అతని సోదరుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు..
ఈ క్రమంలోనే.. ఈనెల 14న నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో రెండు మృతదేహాలున్నట్టు స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.. క్వారీగుంత వద్ద సాకేత్ మృతదేహం ఉండగా.. ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై గ్రానైట్‌రాయితో కొట్టినట్టు ఆనవాళ్లు లభించాయి.. కొద్ది దూరంలో బిందు మృతదేహం ఉంది. తలపై రాయితో కొట్టినట్లు గాయలున్నాయి. ఈనెల 11న వీరిద్దరూ హత్యకు గురై ఉండొచ్చని, హత్యాప్రదేశంలో నలుగురుకు మించి ఉండొచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.. ఇదే ప్రదేశంలో మద్యం సీసాలు కూడా లభించాయి.. అయితే.. హత్యకు ముందు ఏం జరిగిందన్న విషయంపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
సాకేత్ బిందుతో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం.. ఈనెల 8న వనస్థలిపురం వెళ్లిన సాకేత్ బైకుపై బిందును తీసుకొని నానక్‌రామ్‌గూడ చేరాడు. అక్కడ ఓ మిత్రుడి గదిలో మూడు రోజులు ఉన్నాడు.. 11న ఫోన్‌కాల్ రావటంతో సాకేత్, బిందు అనంతపద్మనాభస్వామి గుట్టల వద్దకు చేరుకుని… అక్కడున్న వారితో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత గొడవ జరిగిందని.. హత్యలకు దారి తీసిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. నిందితుల కోసం 5బృందాలు గాలిస్తున్నాయి. ఓ బృందం మధ్యప్రదేశ్ వెళ్లినట్టు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..