Hyderabad: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్
Hyderabad News: కూకట్‌పల్లి KPHBలోని కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. కాసేపటికే పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
హైదరాబాద్, 16 జనవరి 2025: కూకట్‌పల్లి KPHBలోని కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. కాసేపటికే పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. సంక్రాంతి సందర్భంగా వరుసగా సెలవులు కావడంతో రెస్టారెంట్ రెండు రోజులు ఓపెన్ చేయలేదు. రెస్టారెంట్ లో వర్కర్స్ ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెస్టారెంట్ పక్కన ఉన్న కరెంటు స్తంభంపై షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మంటలు ఒక్కసారిగా రెస్టారెంట్లోని కిచెన్ లోకి వ్యాపించడంతో రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది.అక్కడున్న రెండు బైకులు కూడా పూర్తిగా కాలిపోయాయి. రెస్టారెంట్ లోని ఫర్నిచర్ మొత్తం పూర్తిగా కాలిపోయింది.
రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అందులోనే పడుకొని ఉన్నాడు. రెస్టారెంట్లో పని చేస్తున్న కుమార్ ధైర్యం చేసి అద్దాలు పగలగొట్టి లోపల పడుకొని ఉన్న ఓనర్‌ని బయటికి తీసుకొచ్చాడు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే సమయానికే రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది. సుమారు రెండు కోట్ల వరకు నష్టం వాటిలిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

