Robbery: బైక్‌పై వచ్చి.. సినిమా స్టైల్‌లో దోపిడీ, షాక్‌కు గురైన జనం!
బీదర్‌లో బీభత్సం సృష్టించారు దోపిడీ దొంగలు. ఏటీఎంకు డబ్బు తరలిస్తున్న వాహనంపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. బీదర్‌లోని శివాజీ చౌక్ దగ్గర జరిగిందీ కాల్పుల కలకలం. బైక్‌పై వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి, మనీ బాక్స్‌తో పారిపోయారు. బీదర్ నడిబొడ్డున జరిగిన ఈ ఫైరింగ్‌తో అంతా ఉలిక్కిపడ్డారు.
కర్నాటకలోని బీదర్‌లో CMS ఏజెన్సీకి చెందిన సిబ్బంది జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో లోడ్ చేయడానికి తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బు తీసుకొచ్చారు. ఆ డబ్బులను ATMలో పెట్టేందుకు సిద్ధమైన టైమ్‌లో ఈ ఫైరింగ్ జరిగింది. వాహనంలోంచి డబ్బు తీసి ATM లో డిపాజిట్ చేయడానికి వెళుతుండగా అప్పటికే మాటు వేసి అక్కడున్న ముఠా బైక్‌పై వేగంగా వచ్చి కాల్పులు జరిపింది. ధనాధన్ 6 రౌండ్లు కాల్పులు జరిపారు. టార్గెట్ చేసి చేసిన ఎటాక్‌లో ఇద్దరు సెక్యూరిటీ వాళ్లు స్పాట్‌లోనే చనిపోయారు..
నిందితులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చి ఎటాక్ చేశారు అంతా మిస్టరీగానే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పరారయ్యారో కనిపెట్టేందుకు ట్రై చేస్తున్నారు. చూస్తుంటే ఈ గ్యాంగ్ పక్కాగా రెక్కీ చేసి ఇలా ఎటాక్ చేసినట్టు అర్థమవుతోంది. గన్స్‌తో రావడం, ఎటాక్ చేయడం.. ఆపై డబ్బుతో పారిపోవడం అంతా కళ్లుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
నగరం నడిబొడ్డున పట్టపగలు ఈ దోపిడికి పాల్పడటం కలకలం రేపింది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎంకు డబ్బులు డెలివరీ చేసేందుకు వచ్చారు. బ్యాంకుకు అనుబంధంగా ఉన్న ఏటీఎం దగ్గర వాహనం ఆగిపోయింది. అనంతరం వచ్చిన దుండగులు వారి ముఖాలపై కారంపొడి చల్లి కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డు శివ కాశీనాథ్‌కు తీవ్ర గాయాలయ్యారు. అతనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దొంగలను అడ్డుకునేందుకు స్థానికులు వారిపై రాళ్లు రువ్వినట్లు కూడా సమాచారం. దోపిడీ ముఠా కోసం విచారణ ముమ్మరం చేశామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
In a dramatic daylight robbery, bike-borne criminals brazenly attacked and killed a security guard in #Bidar's district headquarters, escaping with Rs 93 lakh meant for an #SBI ATM.
The shocking incident occurred during a cash refill at the ATM at #ShivajiChowk, leaving one… pic.twitter.com/poQwocr84c
— Hate Detector 🔍 (@HateDetectors) January 16, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..