Hyderabad: హైదరాబాద్ మెట్రోలో ఎంత లిక్కర్ తీసుకెళ్లొచ్చు.! ఏయే వస్తువులపై నిషేధం అంటే.?
హైదరాబాద్ మెట్రోలో తరచూ ప్రయాణిస్తున్నారా.? అయితే మెట్రో రైలులో ఏయే వస్తువులు తీసుకెళ్లవచ్చు..? ఏయే వస్తువులు తీసుకెళ్లకూడదు అనే విషయాలు మీకు తెల్సా..? ఒకవేళ తెలియకపోతే.. ఈ స్టోరీలో ఓ లుక్కేయండి. అన్ని విషయాలు మీకు తెలిసిపోతాయి. ఆ వివరాలు ఇలా.

హైదరాబాద్‌లో మెట్రో రైలు వినియోగం విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్‌ను చేధించేందుకు పౌరులు మెట్రోపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రజా రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతీరోజూ లక్షల మంది ప్రయాణీకులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. అయితే మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు ఏం తీసుకెళ్లొచ్చు.? ఏం తీసుకెళ్లకూడదు.? అనే అంశంపై అందరికీ పూర్తి అవగాహన లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో నిషేధిత వస్తువులు తీసుకెళ్లి.. అక్కడి సిబ్బందితో గొడవ పడుతున్నారు. దీంతో ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు మెట్రో రైలు సంస్థ అన్ని స్టేషన్ల ఎంట్రన్స్‌లో నిషేధిత వస్తువుల జాబితాతో బోర్డులు ఏర్పాటు చేసింది.
మద్యం: సీల్ వేసి ఉన్న రెండు బాటిల్స్‌తో మీరు మెట్రోలో ప్రయాణించవచ్చు.
పెట్స్: పెట్స్‌తో(పక్షులు సహా) ప్రయాణం చేసేందుకు నో పర్మిషన్. కేవలం భద్రతా బలగాలు తీసుకెళ్లే జాగిలాలకు అనుమతి ఉంటుంది.
ఇవి కూడా చదవండిగన్స్: ఎయిర్ రైఫిల్, స్టన్‌గన్, మందుగుండు సామగ్రి, మంటలొచ్చే తుపాకీ, గన్ లైటర్, షాక్ ఇచ్చే పరికరాలతో మెట్రో ప్రయాణం నిషేధం
పరికరాలు: సుత్తి, గొడ్డలి, గడ్డపార, రంపం, 7 అంగుళాల కంటే పొడవైన స్క్రూ డ్రైవర్, కట్టింగ్ ప్లేయర్ వంటి పరికరాలను మెట్రోలో అనుమతించరు.
వీటితో పాటు.. మనుషులు లేదా జంతువుల రక్తం.. ప్యాక్ చేయని చేపలు.. కుళ్లిన, ఎండిన, గడ్డకట్టిన మాంసం.. జంతువుల మృతదేహాలు, సీల్ వేయని మొక్కలు, పాడైన కూరగాయల పదార్థాలు, ఎరువులు, ఎముకలు, మాంసం కూడా మెట్రోలో తీసుకెళ్లడం నిషిద్ధం.
యాసిడ్స్, రేడియోధార్మిక పదార్థాలు, విష పదార్థాలు కూడా వెంట తీసుకెళ్లడానికి అవకాశం లేదు. క్రాకర్స్, గన్ పౌడర్, డైనమైట్, హ్యాండ్ గ్రనేడ్, ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు తీసుకెళ్లేందుకు మెట్రో అనుమతి ఇవ్వదు. పొట్టి కత్తి, కత్తి, 4 అంగుళాల కంటే పొడవైన బ్లేడ్ కలిగిన కత్తి, 4 అంగుళాల కంటే ఎక్కువ పొడవు కత్తెరలు, మాంసం కోసే కత్తులు తీసుకెళ్లకూడదు. ఉపాధి రీత్యా వెంట తీసుకెళ్లే పనిముట్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. కాబట్టి మెట్రో రైలులో ట్రావెల్ చేసే పాసింజర్స్ ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే బెటర్.