AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇకపై క్యూఆర్ కోడ్‌తో.. ‘స్మార్ట్’ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. పూర్తి వివరాలు

కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్ వచ్చేసింది. రేషన్ కార్డుల జారీ చేసే ప్రక్రియ, స్మార్ట్ కార్డుల వివరాలు ఏంటి అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: ఇకపై క్యూఆర్ కోడ్‌తో.. 'స్మార్ట్' రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. పూర్తి వివరాలు
Telangana New Ration Cards
Ashok Bheemanapalli
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 13, 2025 | 6:02 PM

Share

తెలంగాణ సర్కార్ జనవరి 26 నుంచి రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. లక్షల మంది అప్లయ్ చేసుకున్నప్పటికీ.. గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో.. కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రేవంత్ సర్కార్.. ప్రజావాణి, ప్రజాపాలన, కులగణన సర్వేతో పాటుగా.. మీ-సేవ సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకొని అర్హులకు కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. అయితే కొత్తగా జారీ చేసే రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మాదిరిగా కాకుండా స్మార్ట్‌ కార్డుల రూపంలో ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రతి స్మార్ట్‌ రేషన్‌ కార్డుకు ఓ క్యూఆర్‌ కోడ్‌ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. స్మార్ట్‌ కార్డు ఎలా ఉండాలన్న విషయంపై ఇప్పటికే వివిధ రకాల డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ డిజైన్ల ప్రక్రియ కొద్దిరోజుల్లో కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కొత్తగా దాదాపు 20 లక్షల మంది రేషర్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వారిలో అర్హులను ఎంపిక చేసి కొత్త కార్డులు ఇవ్వాల్సి ఉంది. చాలావరకు జిల్లాల్లో ఈ మేరకు వడపోత కూడా అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి.. మిగిలిన జిల్లాల్లో మార్చి 8 నుంచే కొత్త రేషన్‌కార్డులు ప్రజలకు ఇవ్వనున్నారు. అయితే మునపటి కార్డుల్లా కాకుండా.. ‘స్మార్ట్‌’ కార్డు రూపంలో ఇస్తూ ఉండటంతో జారీ ప్రక్రియ లేటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులను సైతం స్మార్ట్ కార్డులుగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. బిడ్స్ దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు ఫైనల్ డేట్ ఇచ్చారు. కొత్త కార్డులతో పాటుగా.. ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్నవారికి సైతం క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సివిల్ సప్లయ్ శాఖ ఇప్పటికే టెండర్లు పిలిచింది. బిడ్స్ దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు తుది గడువు ఇచ్చారు. మహిళల ఫొటోతోనే కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం.