Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: అబ్బబ్బ.. ఎండల్లో చల్ల.. చల్లగా.. ఈ పోర్టబుల్ ఏసీ ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు

ఎండాకాలంలో ఏసీ, కూలర్ కొనడానికి కష్టపడుతున్నారా.? మీకోసం పోర్టబుల్ ఏసీని తీసుకోచ్చేశాం. ఇది ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. అలాగే ధర కూడా చాలా చీప్.. మరి ఆ పోర్టబుల్ ఏసీ ఏంటి.? దాని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Portable AC: అబ్బబ్బ.. ఎండల్లో చల్ల.. చల్లగా.. ఈ పోర్టబుల్ ఏసీ ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 11, 2025 | 9:21 PM

మార్చి సగానికి ఇంకా రాలేదు. కానీ ఎండల్లో అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటలు కొట్టగానే.. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత, వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ సమ్మర్ సీజన్‌లో అవి రెండింటిని దరికి చేరకుండా చూసుకోవాలంటే.. కచ్చితంగా ఏసీనో.. కూలరో.. ఉండాల్సిందే. అయితే ఈ తరుణంలోనే ఏసీ, కూలర్‌ ధరలు అమాంతం పెరిగిపోతాయి. మరి ఇలాంటప్పుడు మీకోసం ఓ పోర్టబుల్ ఏసీని ముందుకు తీసుకొచ్చేశాం. మీరు ఈ మండుటెండల్లో కూల్.. కూల్‌గా ఉండాలన్నా.. మీ పిల్లలు చల్లగా చదువుకోవాలన్నా.. ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లను ఓసారి లుక్కేయండి.

ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. ఇది దాదాపుగా 64 శాతం తగ్గింపుతో అనగా రూ. 1599ది కాస్తా.. రూ. 569కి లభిస్తోంది. ఈ పోర్టబుల్ ఏసీకి 3 స్పీడ్ అడ్జస్టబుల్ కూలింగ్ ఫ్యాన్ ఉంది. ఎల్‌ఈడీ నైట్ లైట్‌తో ఉన్న ఈ ఫ్యాన్‌ను మీరు 5 స్ప్రే మోడ్‌స్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోని వాటర్ ట్యాంక్ 600 ఎంఎల్ క్యాపాసిటీ ఉండగా.. ఒక్కసారి దీన్ని నింపితే.. 2.5 గంటల నుంచి 12.5 గంటల వరకు వాడుకోవచ్చు. మీరు ఈ వాటర్ ట్యాంక్‌లో వాటర్ లేదా ఐస్‌ను నింపవచ్చు.

ఇందులోని ఎల్‌ఈడీ లైట్‌కు నైట్ 7 విభిన్న రంగులలో ఉపయోగించుకోవచ్చు. దీనితో తక్కువ కరెంట్ ఖర్చు కావడమే కాదు.. ఈ పోర్టబుల్ ఏసీని యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. కాగా, ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్, వాటర్ ట్యాంక్‌ను మీరు సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు మీ ఇంట్లోనే కాదు.. ఆఫీస్, పిక్నిక్, స్టడీ రూమ్.. ఇలా ఎక్కడైనా దీన్ని వినియోగించవచ్చు.(Source)