AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambedkar Statue: ఆకాశమంత అంబేడ్కర్‌ విగ్రహానికి పునాది ఎలా పడిందో తెలుసా? అసలు ఈ స్టాట్యూ స్పెషాలిటీ ఏంటంటే?

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఇవాళ (ఏప్రిల్‌ 14) ఆవిష్కరించనున్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు

Ambedkar Statue: ఆకాశమంత అంబేడ్కర్‌ విగ్రహానికి పునాది ఎలా పడిందో తెలుసా? అసలు ఈ స్టాట్యూ స్పెషాలిటీ ఏంటంటే?
Ambedkar Statue
Basha Shek
| Edited By: |

Updated on: Apr 14, 2023 | 3:15 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఇవాళ (ఏప్రిల్‌ 14) ఆవిష్కరించనున్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విగ్రహావిష్కరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కనివినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులతో పాటు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చే ప్రజల కోసం పూర్తి ఏర్పాట్లు చేసింది. కాగా ఇవాళ ఆవిష్కృతం కానున్న అంబేడ్కర్‌ విగ్రహం మన దేశంలోనే అతిపెద్దైనది. మరి ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ఈ విగ్రహానికి పునాది ఎలా పడింది? అలాగే దీని ప్రత్యేకతలేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.

ఇలా మొదలైంది..

  • 2016, ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన
  • 2016, నవంబర్‌ 4న విగ్రహావిష్కరణ కమిటీ
  • 2016, మే 21న టెక్నికల్‌ కమిటీ ఏర్పాటుపై జీవో జారీ
  • 2018, ఏప్రిల్ 4న మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు నిర్మాణ బాధ్యతలు
  • పార్లమెంటు ఆకృతిని బేస్‌గా ఉండే నమూనాకు సీఎం ఆమోదం
  • విగ్రహ నమూనా రూపొందించిన రాం వంజీ సుతార్
  • ఖరారు చేసిన డిజైన్‌కి రూ. 146.50 కోట్లు అంచనా
  • 2020, సెప్టెంబరు 16న.. రూ. 146.50 కోట్లను ఆమోదిస్తూ ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ ఆమోదం
  • రోడ్లు–భవనాల శాఖ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
  • కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థకు నిర్మాణ బాధ్యతలు
  • 2022, జూన్ 30న.. 12నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం

విగ్రహం ప్రత్యేకతలు

  • ఎత్తు – 125 అడుగులు
  • బేస్ – 50 అడుగులు
  • గ్రౌండ్ ఫ్లోర్‌ – 172 అడుగులు
  • టెర్రాస్‌ – 74 అడుగులు
  • లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం – 2,066 చ.అ.
  • గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం – 15,200 చ.అ.
  • బేస్‌లో – మ్యూజియం, లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, కాన్ఫరెన్స్‌ హాల్
  • బేస్ టెర్రాస్ విస్తీర్ణం – 2,200 చ.అ
  • అంబేద్కర్ మందిరం విస్తీర్ణం – 11.7 ఎకరాలు
  • స్టీల్ వినియోగం – 360 టన్నులు
  • పైపూతకు వాడిన కంచు – 114 టన్నులు

అంబేడ్కర్ స్మృతి వనం ల్యాండ్ ఎస్కేప్ ఏరియా నైట్ విజువల్స్ :

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..