Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసిన రియల్ షెకావత్ ఇతనే.! అసలు మ్యాటర్ తెలిస్తే

పుష్పరాజ్‌ను పుష్ప 2 మూవీలో అరెస్ట్ చేసేందుకు ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ అస్సలు సినిమా అయ్యేంతవరకు అది జరగదు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం సీన్ వేరు..!

Allu Arjun: పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసిన రియల్ షెకావత్ ఇతనే.! అసలు మ్యాటర్ తెలిస్తే
Allu Arjun & Police
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Ravi Kiran

Updated on: Dec 15, 2024 | 12:18 PM

పుష్ప 2.. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో రిలీజ్ తర్వాత కూడా అంతే హైప్ క్రియేట్ చేసింది. అయితే పుష్ప 2లో పుష్ప రాజును అరెస్టు చేసేందుకు ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే ఇదంతా రీల్ స్టోరీ.. కానీ రియల్ స్టోరీలో మాత్రం పుష్పాను అరెస్టు చేస్తాడు ఓ ఇన్స్పెక్టర్.. అతని పేరే బానోతు రాజు నాయక్.

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్‌కు పెద్ద సంఖ్యలో సినిమా చూసేందుకు అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమాని అయిన శ్రీ తేజ్ కుటుంబ సభ్యులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడ జరిగిన తొక్కిసలాటలో భాగంగా శ్రీ తేజ్ తల్లి రేవతి అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్‌‌‌‌లో శ్రీ తేజ్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌తో సహా వ్యక్తిగత బౌన్సర్లు, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. అయితే పుష్ప 2 సినిమాలో ఎస్పీ షెకావత్‌కు దొరకకుండా తప్పించుకునే పుష్ప రాజ్ రియల్ లైఫ్‌లో మాత్రం పోలీసులకు చిక్కాడు. పుష్పాను అరెస్టు చేశాడు చిక్కడపల్లి సీఐ బానోత్ రాజు నాయక్ అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్‌కు ఈ ఇన్స్పెక్టర్ కూడా ఓ అభిమాని. ఒక్కసారైనా అల్లు అర్జున్‌తో ఫోటో దిగాలనుకున్న ఇన్స్పెక్టర్ తన అభిమాన హీరోని అరెస్టు చేసే ఒక రోజు వస్తుందని ఊహించలేదని అంటున్నారు.

ఆ తర్వాత అల్లు అర్జున్‌ను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరపరచగా.. రిమాండ్ విధించింది కోర్ట్. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన అల్లు అర్జున్‌కు మభ్యంతర బెయిల్ వచ్చింది. దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకునే  సమయంలో ఇక్కడ ఒక ట్విస్ట్ నెలకొంది. ఆర్డర్ కాపీస్ ఆలస్యంగా రావడంతో చంచల్‌గూడ జైల్లోనే ఒక రాత్రి పుష్పరాజ్ ఉన్నాడు. నిన్న జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వెళ్లి.. ఈ కేసును ఏ విధంగా లీగల్‌గా ఎదుర్కోవాలి. కనీసం ఒక్కరోజు కూడా జైల్లో ఉండేందుకు వీలులేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. జైల్లో ఉంచడంతో కోర్టు ధిక్కరణ చేయడంపై ఏ విధంగా లీగల్గా ముందుకెళ్లాలని అల్లు అర్జున్ న్యాయవాదులతో మాట్లాడాడు. ఈ విధంగా అనేక నాటికి పరిణామాల మధ్య పుష్ప అరెస్టు.. రిమాండ్.. విడుదల జరిగింది. అయితే రీల్ లైఫ్‌లో ఎస్పీ విఫలమైనా.. రియల్ లైఫ్‌లో మాత్రం ఓ పోలీస్ అధికారి పుష్పరాజ్‌ను అరెస్టు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి