AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్.. ఎందుకో తెలుసా..?

ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..? ఇప్పుడు ఇదే ప్రశ్న తెరపైకి వస్తోంది. భూసేకరణ జరిగితే జానారెడ్డి దాదాపు 700 గజాలు ఇవ్వాల్సి ఉంటుంది.. బాలయ్య ఇల్లు సగానికి సగం రోడ్‌వైడెనింగ్‌లో పోతుంది. బాలయ్య, జానారెడ్డి మాత్రమే కాదు.. అల్లు అర్జున్ మామతోపాటు పలువురు ప్రముఖుల నివాసాలు కూడా మార్క్ చేశారు.

Telangana: బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్.. ఎందుకో తెలుసా..?
Balakrishna & Janareddy
Ravi Kiran
|

Updated on: Dec 15, 2024 | 11:43 AM

Share

భాగ్యనగరాన్ని గతకొన్ని నెలలుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో బుల్డోజర్‌ పేరు వింటే నగరవాసులు జంకుతున్నారు. లేటెస్ట్‌గా నటుడు బాలకృష్ణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఇళ్లకు మార్క్‌ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య, జానారెడ్డి మాత్రమే కాదు.. అల్లు అర్జున్ మామతోపాటు పలువురు ప్రముఖుల నివాసాలు కూడా మార్క్ చేశారు. అసలింతకు అవి హైడ్రా మార్కింగ్సేనా..? మరేమైనా కారణాలున్నాయా..?

ఫిల్మ్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 45లో ఉన్న బాలకృష్ణ నివాసానికి మార్కింగ్ వేశారు అధికారులు. ఆయన నివాసంలో దాదాపు ఆరు అడుగుల మేర మార్క్ చేశారు. ఇటు జానారెడ్డి ఇంటి కాంపౌండ్‌కు కూడా మార్క్‌ చేసి వెళ్లారు. అయితే ఈ హైడ్రా మార్కింగ్స్‌ కానే కావు.. వీళ్లవి అక్రమ నిర్మాణాలు అంతకన్నా కాదు. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్‌లు, ఎనిమిది చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉన్న పలు నివాసాలకు అలాగే షాపులకు మార్క్‌ చేశారు అధికారులు.

అందులో జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లు కూడా ఉన్నాయ్. ఏడాదిన్నరలో బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్న సర్కార్‌.. పనులను స్పీడప్‌ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ జుబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్డు నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజ్ అగ్రసేన్ సర్కిల్‌, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు రానున్నాయి. అందుకు దాదాపు 12వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప