AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Exam: పకడ్భందీగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షలు.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పేపర్ 1 పరీక్ష ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. చాలా కాలం తర్వాత రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతుండటంతో అధికారులు సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టారు..

TGPSC Group 2 Exam: పకడ్భందీగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షలు.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
TGPSC Group 2 Exam
Srilakshmi C
|

Updated on: Dec 15, 2024 | 3:04 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15: తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 783 గ్రూప్‌ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి నేడు, రేపు (డిసెంబర్ 15, 16) పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,368 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఉదయం సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. మధ్యాహ్నం సెషన్‌లో పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం నిబంధన వల్ల పలు చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను అధికారులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించలేదు. వీరంతా కన్నీరు కారుస్తూ బయటే ఉండిపోయారు.

కాగా గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, డిసెంబరు 29న ప్రకటన జారీ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్‌ 2 పేపర్‌ 1 పరీక్ష సమయంలో బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్ధులంతా ఎలాంటి సందేహాలు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ఫలితాలు త్వరలోనే ఇస్తామన్నారు.

గ్రూప్‌ 2 పరీక్ష మొత్తం 4 పేపర్లకు జరుగుతుంది. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. డిసెంబర్‌ 16 (సోమవారం) పేపర్‌ 3, 4 పరీక్షలు జరగనున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్