Kishan Reddy: భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని గ్రూప్ సెంటర్ CRPF తిరంగా ర్యాలీలో నిర్వహించారు.. ఆగస్టు 15 రోజు దేశవ్యాప్తంగా ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 14: ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని గ్రూప్ సెంటర్ CRPF తిరంగా ర్యాలీలో నిర్వహించారు.. ఆగస్టు 15 రోజు దేశవ్యాప్తంగా ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇలా ప్రతిచోటా జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా CRPF చాంద్రాయణ గుట్ట నుండి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఇందులో స్థానికులు, స్టూడెంట్స్, టూరిస్ట్‌లు, వికలాంగులు, పారిశుధ్య కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొని తిరంగా ర్యాలీనీ విజయవంతం చేశారు.. చేతిలోత్రివర్ణ పతాకాలతో ఈ బైక్‌పై ర్యాలీ సాగింది.. ఆ తర్వాత బర్కత్ పురా బీజేపీ కార్యాలయంలో కూడా త్రిరంగా ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.. బర్కత్ పురా బీజేపీ సిటీ ఆఫీస్ నుంచి నారాయణ గూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ” కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర వేడుకలలో భాగ్యసాములు కావాలని సూచించారు. ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్ సైకిల్ లతో ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారురాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల జిల్లా కేంద్రాలలో 75 మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని అమృత వనంగా పేరు పెట్టడం జరిగిందని కిషన్ రెడ్డి వివరించారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని.. ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలని సూచించారు.
వీడియో చూడండి..
ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. దేశంలో నిరుద్యోగం,పేదరికం వంటి సమస్యల పరిష్కారం కోసం మోదీ సర్కార్ కృషి చేస్తోందన్నారు. 75ఏళ్ల స్వాతంత్రోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా… హైదరాబాద్‌లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి.- ,@kishanreddybjp గారు కేంద్ర మంత్రి వర్యులు,బిజెపి తెలంగాణ అధ్యక్షులు.#HarGharTiranga pic.twitter.com/dNmq0Zpm4M
— BJP Telangana (@BJP4Telangana) August 14, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..