Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్‌ బాధితురాలికి మహారాష్ట్రలో చికిత్స.. విషమంగా కాజల్‌ ఆరోగ్యం..

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో(Jubilee Hills Car Accident) తీవ్రంగా గాయపడిన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఐదు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండున్నర నెలల బాలుడు అక్కడిక్కడే..

Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్‌ బాధితురాలికి మహారాష్ట్రలో చికిత్స..  విషమంగా కాజల్‌ ఆరోగ్యం..
Jubilee Hills Car Accident
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2022 | 7:21 PM

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో(Jubilee Hills Car Accident) తీవ్రంగా గాయపడిన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఐదు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండున్నర నెలల బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా.. బాలుడి తల్లి కాజల్‌ చౌహాన్‌ పరిస్థితి మరింత విషమంగా మరింది. మహారాష్ట్రకు చెందిన కాజల్‌ను ఘటన అనంతరం చికిత్స కోసం పోలీసులు నిమ్స్‌లో చేర్పించారు. అయితే మరుసటి రోజు నుంచి ఆమె ఆస్పత్రిలో కనిపించకుండా పోయింది. అనంతరం బాధితురాలు కాజల్ చౌహాన్ను మహారాష్ట్రకు గుర్తు తెలియని వ్యక్తులు తరలించారు. అనంతరం మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. హాస్పిటల్లో కాజల్ చౌహాన్కు చికిత్స అందిస్తున్నారు.

ఇదిలావుంటే.. కాజల్ కుటుంబ సభ్యులను కారు యజమాని అనుచరులు భయాందోళనకు గురి చేయడంతోపాటు మబ్బెపెట్టినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రకు పంపినట్లు ఆరోపణలొచ్చాయి. ప్రమాదంలో కాజల్‌ కుమారుడు అక్కడికక్కడే చనిపోగా.. ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం సంచలనంగా మారింది. ఈ ప్రమాద ఘటన జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంలో ఉన్న మరో యువకుడు అబ్నాన్‌ తానే డ్రైవింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా నిజంగా డ్రైవింగ్‌ చేసింది అతనేనా? లేదా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఈ నెల 17న రాత్రి  జూబ్లీహిల్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే షకీల్ బంధువులకు చెందిన కారు అదుపు తప్పి రోడ్డుపై బుడగలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారిక చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు. కాజల్ చేతిలో ఉన్న చిన్నారి రణవీర్ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే చిన్నారి రణవీర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు.

ప్రమాదం సమయంలో కారు డ్రైవ్ చేసింది ఎమ్మెల్యే కొడుకేనంటూ తీవ్ర దుమారం రేపాయి. బాధితురాలు కాజల్ చౌహన్ ను నిందితులు బలవంతంగా మహారాష్ట్రకు తరలించారంటూ ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాజల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..