Jubilee Hills by Election Dates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ ఖరారు.. ప్రకటించిన ఈసీ!
Jubilee Hills by Election Dates: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించి బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయాయి. అయితే ప్రచారంలో మాత్రం మూడు పార్టీలు దూసుకుపోతున్నాయి. బీహార్ ఎన్నికల తేదీని ప్రకటించిన ఈసీ.. జూబ్లీ హీల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీని కూడా ప్రకటించింది..

Jubilee Hills by Election Dates: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించి బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయాయి. అయితే ప్రచారంలో మాత్రం మూడు పార్టీలు దూసుకుపోతున్నాయి. బీహార్ ఎన్నికల తేదీని ప్రకటించిన ఈసీ.. జూబ్లీ హీల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీని కూడా ప్రకటించింది. నవంబర్ 11 జూబ్లీహీల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:
- ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల
- ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.
- ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ
- 22న నామినేషన్లను స్క్రుటినీ
- నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక
- నవంబర్ 14వ తేదీన కౌంటింగ్, ఫలితాల విడుదల
అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు:
జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చివరి అంకానికి చేరింది. సర్వే ఆధారంగా ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు ఇంచార్జ్ మంత్రులు. ఢిల్లీలో సోమవారం జరగున్న స్క్రీనింగ్ కమిటీకి డిటెయిల్స్ పంపనుంది పీసీసీ. రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రాంమోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను కూడా టికెట్ రేసులో ఉన్నానంటున్నారు అంజన్ కుమార్ యాదవ్.
మరోవైపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు, కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న అంశంపై ఆరా తీశారు. సోమవారం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం
By-election in eight assembly constituencies of Jammu &Kashmir, Rajasthan, Jharkhand, Telangana, Punjab, Mizoram and Odisha to be held on 11th November; counting of votes on 14th November pic.twitter.com/SJvErJnmpA
— ANI (@ANI) October 6, 2025
బీజేపీ అభ్యర్థి కోసం వేట..
బీజేపీ కూడా ఇప్పటికే అభ్యర్థి ఎంపిక కోసం త్రీమెన్ కమిటీ వేసింది. ఈ కమిటీ జూబ్లీహిల్స్ నేతల అభిప్రాయాలను సేకరించింది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు బీజేపీ నేతలు.
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక ఏర్పడింది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌స్.. కారు గుర్తుపై మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు ప్రాబబుల్స్ నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డిలు ఉండగా, బీజేపీ నుంచి నగులుగురు ఆశావహులు దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Public Holiday: ఇక్కడ అక్టోబర్ 7న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో.. ఎంతపెద్ద పామునైనా కరకర నమిలేస్తుంది.. ఇలాంటి పక్షిని మీరెప్పుడైనా చూశారా?




