AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఎంతపెద్ద పామునైనా కరకర నమిలేస్తుంది.. ఇలాంటి పక్షిని మీరెప్పుడైనా చూశారా?

Viral Video: ఈ వీడియోలోని పక్షులు సదరన్ గ్రౌండ్ హార్న్‌బిల్స్ అవి పఫ్ అడెర్స్ అని పిలిచే పాములను వేటాడుతాయి. పఫ్ అడెర్స్ పాము అనేది అత్యంత విషపూరితమైన వైపర్ జాతికి చెందినది. ఈ పాముల కాటుతో ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో లెక్కలేనన్ని మందిని చనిపోతున్నారని నివేదికల..

Viral Video: వామ్మో.. ఎంతపెద్ద పామునైనా కరకర నమిలేస్తుంది.. ఇలాంటి పక్షిని మీరెప్పుడైనా చూశారా?
Subhash Goud
|

Updated on: Oct 06, 2025 | 3:00 PM

Share

Vrial Video: పాములు అనేవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. వాటిని చూడగానే ప్రజలు వణికిపోతారు. మనుషుల గురించి చెప్పనవసరం లేదు. అయితే, పాములకు అస్సలు భయపడని కొన్ని పక్షులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఈ పక్షి పేరు గ్రౌండ్ హార్న్‌బిల్. ఇది ఆఫ్రికాకు చెందినది. గ్రౌండ్ హార్న్‌బిల్ పాములను చంపేదిగా పరిగణిస్తారు. పాములు ఎంత విషపూరితమమైనవిగా ఉన్నా చంపే సామర్థ్యం ఆ పక్షిలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Public Holiday: ఇక్కడ అక్టోబర్‌ 7న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలోని పక్షులు సదరన్ గ్రౌండ్ హార్న్‌బిల్స్ అవి పఫ్ అడెర్స్ అని పిలిచే పాములను వేటాడుతాయి. పఫ్ అడెర్స్ పాము అనేది అత్యంత విషపూరితమైన వైపర్ జాతికి చెందినది. ఈ పాముల కాటుతో ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో లెక్కలేనన్ని మందిని చనిపోతున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. కానీ గ్రౌండ్ హార్న్‌బిల్స్ ఈ పాముకి అస్సలు భయపడవట. వీడియోలో ఈ పక్షులు పఫ్ అడెర్‌ను వేటాడి, దానిని చంపి, సంతోషంగా ఎలా తింటున్నాయో మీరు చూడవచ్చు. గ్రౌండ్ హార్న్‌బిల్స్ ముక్కులు చాలా పెద్దవిగా, పదునైనవిగా, బలంగా ఉంటాయి. పాములు దానిని తట్టుకోలేవు. అందుకే ఈ పక్షులు సులభంగా పాములను వేటాడి చంపి తింటాయి.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @AmazingSights అనే IDతో షేర్ అయ్యింది. “ఆఫ్రికాలో ఇతర పాము కంటే పఫ్ యాడర్లు ఎక్కువ మానవ మరణాలకు కారణమవుతాయి. దక్షిణ గ్రౌండ్ హార్న్‌బిల్‌లకు అలాంటి సమస్యలు లేవు” అని క్యాప్షన్ ఉంది. ఈ ఒక నిమిషం 19 సెకన్ల వీడియోను చాలా మంది వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ఆంటిలియా రహస్యాలు.. ముఖేష్‌ అంబానీ ఇంట్లో పని చేసే చెఫ్‌కి జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!

ఇది కూడా చదవండి: Refrigerator: ఫ్రిజ్‌లో వేడి పదార్థాలు పెడుతున్నారా? పెద్ద నష్టమే.. ఏంటో తెలుసుకోండి!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి