‘ఎవడ్రా.! మా ప్రభుత్వాన్ని కూలగొట్టేది’.. తప్పుడు ప్రచారంపై సీఎం రేవంత్ సీరియస్..
సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం.. 15 పార్లమెంట్ స్థానాలు గెలువాలనే లక్ష్యంతో మరోసారి ఇంద్రవెల్లి నుంచే క్యాంపెయిన్‌కు సిద్ధమయ్యారు.

Cm Revanth Reddy
సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం.. 15 పార్లమెంట్ స్థానాలు గెలువాలనే లక్ష్యంతో మరోసారి ఇంద్రవెల్లి నుంచే క్యాంపెయిన్‌కు సిద్ధమయ్యారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్.. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇస్లాంపూర్ ఆలయానికి వస్తుండటంపై మెస్రం వంశస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
