AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: త్రివర్ణ శోభితమైన హైదరాబాద్‌ ఐకాన్‌.. మువ్వన్నెల కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌.

Independence Day: యావత్‌ దేశం స్వాతంత్ర దినోత్సవ వేడులకు సిద్ధమవుతోంది. భారత్‌కు స్వాంతంత్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో వేడుకలు అట్టహాసంగా..

Hyderabad: త్రివర్ణ శోభితమైన హైదరాబాద్‌ ఐకాన్‌.. మువ్వన్నెల కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌.
Charminar
Narender Vaitla
|

Updated on: Aug 15, 2021 | 6:41 AM

Share

Independence Day: యావత్‌ దేశం స్వాతంత్ర దినోత్సవ వేడులకు సిద్ధమవుతోంది. భారత్‌కు స్వాంతంత్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో వేడుకలు అట్టహాసంగా జరపడానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రాచీన కట్టడాలు, ప్రభుత్వ కార్యలయాలను అధికారులు సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో పలు కట్టడాలను అందంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఐకాన్‌ కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు త్రివర్ణ పతాక రంగులతో కూడిన లైటింగ్‌లను ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగానే హైదరాబాద్‌కే ఐకాన్‌గా నిలిచే చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. పాతబస్తీలోని చార్మినార్‌ కట్టడంపై త్రివర్ణ పతాక రంగులతో కూడిన విద్యుత్‌ కాంతులు ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో ప్రజలు రాత్రి నుంచే చార్మినార్‌ను సందర్శించడానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఇక మరికొందరు విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌కు సంబంధించిన వీడియోను వాట్సాప్‌లలో షేర్‌ చేస్తూ, స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు గోల్కోండ కోట వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. భాగ్యనగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా అధికారులు స్వాతంత్ర్య దినోత్స వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.

Also Read: Andhra Pradesh: సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు దక్కని మద్దతు ధర.. ఆందోళనకు దిగిన రైతన్న..

Andhra Pradesh: ఏం కాదులే అని ముందుకు వెళ్లాడు.. అందరి ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు.. అదృష్టం బాగుండి బయటపడ్డారు..

Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..