HYDRA: హైడ్రా ఈజ్ ఆన్ డ్యూటీ.. ఘట్‌కేసర్‌లో కూల్చివేతలకు రంగం సిద్ధం
ఘట్కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
హైడ్రా ఈజ్ ఆన్ డ్యూటీ.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల విషయంలో తగ్గేదేలే అంటోంది హైడ్రా. దీనికి సంబంధించి మనకు ఘట్‌కేసర్ నుంచి బ్రేకింగ్ అందుతోంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్దమైంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు అంతా సిద్ధం చేశారు అధికారులు. స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్‌పై ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగారు హైడ్రా అధికారులు. ఫిర్యాదుల నేపథ్యంలో సర్వే చేసిన అధికారులు అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించారు. దీంతో కూల్చివేతలకు ఉపక్రమించారు. కూల్చివేత నేపథ్యంలో అక్కడ పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
