Hyderabad: నాగార్జున N కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం…

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా టీమ్ కూల్చివేసింది. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు.

Hyderabad: నాగార్జున N కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం...
N Convention Center
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 24, 2024 | 12:33 PM

హైదరాబాద్ మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి..కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు.

కబ్జా చేసిన 3 ఎకరాల 30 గుంటల్లో 2 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉంది. మిగిలిన భూమి చెరువు శిఖంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదులు అందాయి. అప్పట్లోనే కూల్చివేస్తారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో అప్పుడు కూల్చివేత జరగలేదు. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది.

సినీ హీరో నాగార్జున N3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్ కింద N-కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు. దాదాపు 2,3 వేల మంది కూర్చునేలా మెయిన్‌ హాల్‌, అవుట్‌డోర్‌ సీటింగ్‌ నిర్మించారు. ఇందులో సోషల్ ఈవెంట్స్, ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్స్ నిర్వహిస్తున్నారు. 2015 ఆగస్ట్‌ 20 నుంచి N-కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి N-కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..